4 కోట్లతో తీశారు-వందకోట్లు తెచ్చింది

Sairat movie collected 100 crores

05:52 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Sairat movie collected 100 crores

చిన్న సినిమా అయినా దమ్ముంటే దుమ్ము రేపేస్తుంది అనడానికి ఇటీవల మరాఠీలో వచ్చిన ఓ చిన్న చిత్రం నిదర్శనం. ఈ సినిమా భారీ సంచలనాలకు వేదికైంది. ఆ సినిమా చేసిన వసూళ్లు పెద్ద చిత్రాలకు ఒణుకు తెప్పించింది. అదే ఆకాష్‌ తోషర్‌, రింకు రాజ్‌ గురు జంటగా నటించిన ‘సైరాట్‌’ చిత్రం. నాగరాజ్‌ దర్శకత్వంలో కేవలం రూ. 4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల మైలు రాయికి చేరువైంది. దాంతో ఈ సినిమాని రీమేక్‌ చేయాలని అన్ని భాషల నిర్మాతలూ క్యూ కడుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ హక్కుల్ని రాక్‌ లైన్‌ వెంకటేష్‌ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

మాతృకను తెరకెక్కించిన నాగరాజ్‌... ఈ రీమేక్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే హీరోహీరోయిన్లు ఎవరన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాకున్నా ఈ యేడాది చివర్లో ‘సైరాట్‌’ రీమేక్‌ సెట్స్‌ పైకి వెళ్లనుంది. కథాబలం ఉంటే తిరుగులేదని నిరూపించిన ఈ చిత్రం సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

English summary

Sairat movie collected 100 crores