మొన్న 'బిచ్చగాడు' ఇప్పుడు 'సైతాన్'(వీడియో)

Saithan movie teaser

04:43 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Saithan movie teaser

కథ, కధనం ఉంటే ఆ చిత్రానికి ఢోకా ఉండదన్న వాస్తవాన్ని జీర్ణించుకున్న విజయ్ ఆంటోనీ ఈ తరం కథానాయకులకి పూర్తి భిన్నమైన పంథాలో కథల్ని ఎంచుకుంటూ విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. సంగీత దర్శకుడిగా రాణిస్తున్న సమయంలో హీరోయిజంపై మనసు పారేసుకున్న ఆంటోనీ, తనలోని ప్లస్, మైనస్ లను తెలుసుకుని తన బాడీలాంగ్వేజ్ కి తగ్గ కథల్ని ఎంచుకుంటూ కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 'నాన', 'సలీమ్', 'పిచ్చైకారన్' చిత్రాలతో భిన్నమైన నటుడిగా నిలిచిన ఆంటోని, ఈ మధ్య తెలుగులో డబ్ అయిన 'బిచ్చగాడు' తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కొట్టేసాడు. ఇక ఇదే కోవలో వస్తున్న మరో చిత్రం 'సైతాన్'.

ఇందులో కూడా ఒక వైవిధ్యమైన కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ట్టు తెలుస్తోంది. సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లర్ ప్రధానంగా సైతాన్ తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ ను సోమవారం విడుదల చేయగా, వీక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న సైతాన్ ను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై విజయ్ ఆంటోనీ సొంతంగా నిర్మిస్తున్నారు. ఆరా సినిమాస్ బ్యానర్ పై దీపావళికి సైతాన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బిచ్చగాడు చిత్రాన్ని కొని కాసుల వర్షం పండించుకున్న వాళ్ళే ఈ చిత్రం పై కూడా కన్నేసినా, మిగతావాళ్ళు కూడా పోటీకి వస్తున్నారట. మరి ఎవరికి దక్కుతుందో అదృష్టం.

English summary

Saithan movie teaser