2020లో గోల్డ్ మెడల్ తెస్తుంది

Sakshi Malik Mother Talks About Her Hard Work

11:23 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Sakshi Malik Mother Talks About Her Hard Work

పిల్లలు విజయం సాధిస్తే , తల్లిదండ్రులకు వుండే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు రియో ఒటింపిక్స్ లో భారత్ కు మొదటి పతకాన్ని బ్రాంజ్ మొడల్ రూపంలో అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ తల్లిదండ్రులు కూడా అదే ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇప్పటికే తొలిపతకం తెచ్చినందుకు యావత్ భారతదేశం ఎంతో సంతోషించింది. సాక్షికి జేజేలు పలికింది. అందుకే ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవుధుల్లేవు. అయితే ఈ సందర్భంగా సాక్షి తల్లి మీడియాతో మాట్లాడుతూ 'నా కూతురు 2020లో జరిగే ఒలింపిక్స్ లో దేశానికి బంగారు పతకాన్ని తీసుకొస్తుంది' అని చెప్పారు. ప్రస్తుతం సాక్షికి 23 సంవత్సరాలు కావడంతో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ కు 28 సంవత్సరాలకు చేరకుంటుంది. ఆసమయానికి ప్రాక్టీస్ చేసి ఫుల్ ఎనర్జీతో గోల్డ్ కొల్లగొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. సాక్షి ప్రదర్శనతో ఆమె పేరెంట్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. వారి వద్దకు దేశ వ్యాప్తంగా ఉన్న విలేకర్లు క్యూ కడుతున్నారు. అయితే అందరితో రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. బెస్ట్ ఆఫ్ లాక్ సాక్షి.

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

English summary

Sakshi Malik's mother expresses joy after medal at rio Olympics. Sakshi Malik Mother Talks About Her Hard Work.