చావు గురించి ముందే తెలియాలా..

Saliva Test Says About Your Death

06:51 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Saliva Test  Says About Your Death

భూమి మీద పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు. కానీ మనం ఎప్పుడు చనిపోతామనే విషయం ఎవరికీ తెలియదు. మరణం గురించి మనిషికి ముందుగానే తెలిస్తే.. మానసికంగా కుంగిపోతాడు. కానీ ఇప్పుడు మనిషి మరణం గురించి ముందుగానే తెలుసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వర్సిటీ పరిశోధకులు. మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తోంది అనే విషయం ఇప్పుడు తెలుసుకోవడం చాలా సులభం అంటున్నారు. లాలాజలం లోని యాంటిబాడీల కౌంట్ ను బట్టి మరణం ఎప్పుడు సంభవించేది ముందుగానే తెలుసుకోవచ్చట. ఈ విషయంపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. లాలాజలం లో ఉండే వివిధ రకాల స్రావాలను వాటి శాతాన్ని బట్టి శరీరం యొక్క ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి మనిషి యొక్క ఆయువును లెక్కించవచ్చనని ఈ పరిశోధకులు అంటున్నారు.

English summary