దుమ్ము రేపనున్న ‘ధూమ్‌ 4’ కాంబినేషన్

Salman And Ranveer Singh To Act In Dhoom 4

03:35 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Salman And Ranveer Singh To Act In Dhoom 4

ఒకదాన్ని మించిన మరొకటి భారీ విజయం నమోదు చేసుకుంటూ వస్తున్న ‘ధూమ్‌’ సీరి్‌సలో నాలుగో సినిమాకు మరింత క్రేజీ కాంబినేషన కుదిరింది. హీరో కంటే విలన్ కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటూ వస్తున్న ఈ సినిమాలో ఈ సారి విలన్ పాత్రను సల్మానఖాన్ పోషించనున్నాడు. ఇప్పటివరకూ మూడు సినిమాల్లో పోలీసాఫీసర్‌గా హీరో పాత్రను అభిషేక్‌బచ్చన్ చేసాడు. అయితే అతనితో పాటు, అతనికి అసిస్టెంట్‌గా కనిపిస్తూ వచ్చిన ఉదయ్‌ చోప్రా సైతం కొత్త సినిమాలో కనిపించడు. తాజా సినిమాలో హీరోగా ఇటీవల ‘బాజీరావ్‌ మస్తానీ’లో నటనతో అందరి ఆదరణ పొందిన రణవీర్‌సింగ్‌ను యశ్రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ ఎంచుకుంది. విలన్ జోడీగా ఇప్పటివరకు మూడు సినిమాల్లో వరుసగా ఇషా డియోల్‌, ఐశ్వర్యా రాయ్‌, కట్రీనా కైఫ్‌ నటించగా, ఇప్పుడు సల్మాన్ జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇక ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ అమితాబ్‌ బచ్చన్. ఆయన పాత్రేమిటన్నది సస్పెన్స్. చాలా కాలం తర్వాత మరో హీరోతో కలిసి సల్మాన్ తెరపంచుకోనుండటం విశేషం. అదీ నవతరం హీరోల్లో మంచి క్రేజ్‌ ఉన్న రణవీర్‌తో చేస్తుండటం ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది. ‘ధూమ్‌ రీలోడెడ్‌: ద చేజ్‌ కంటిన్యూస్‌’ పేరుతో రూపొందే ఈ సినిమా కూడా విజయ్‌కృష్ణ ఆచార్య డైరెక్ట్‌ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రేజీ కాంబినేషన్ తో కూడిన ఈ చిత్రం పై భారీ అంచనాలు వుండడం కూడా సహజమే కదా.

ఇవి కూడా చదవండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

ఇవి కూడా చదవండి: వామ్మో అనసూయ అలా పెంచేసిందేంటి!

English summary

As we all know well that Dhoom Series was super hit at the box office and now another movie was coming in that series and the Stars Like Salman Khan,Ranveer Singh and Big B Amitab Bachchan were going to act in this new series.