ఎనిమిదేళ్ళ తరువాత కలిసి నటించనున్న సల్మాన్‌, షారుక్‌

Salman And Sharukh To Shoot Together

01:06 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Salman And Sharukh To Shoot Together

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ఖాన్‌, షారున్‌ఖాన్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వహించనున్న బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ లో షారుక్‌ఖాన్‌ తన తాజా చిత్రం దిల్‌వాలే చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్‌ఖాన్‌ ధృవీకరించాడు.

సల్మాన్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ షోలో షారుక్‌ఖాన్‌ పాల్గొనడం ఇదే మొదటిసారి. వీరిద్దరూ కలిసి చివరిసారిగా కుచ్‌ కుచ్‌ హోతా హై సినిమాలో నటించారు. ఆ తర్వాత షారుక్‌ఖాన్‌ యాంకర్ చేసిన సూపర్ హిట్ ప్రోగ్రాం కౌన్‌ బనేెగా క్రోర్ పతి లో టీ.వి. షోలో సల్మాన్‌, కత్రినా తో కలిసి పాల్గొన్నాడు.

సల్మాన్‌ఖాన్‌ చెల్లెలు అర్పిత వివాహం సందర్భంగా వివాహానికి హాజరైన షారుక్‌ఖాన్‌ ను చూసి అభిమానులు సంతోషం చెందారు. గత సంవత్సర కాలంగా అనేక సందర్భాలలో కలుసుకున్న వీరిద్దరి మధ్య మళ్ళీ స్నేహం చిగురించింది. దీనితో వీరి అభిమానుల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది.

English summary

Bollywood super stars salman khan and sharukh khan to shoot together after 8 long years