అమ్మో సల్మాన్ హాట్ అంటున్న సొనమ్

Salman Is Hot Says Sonam Kapoor

10:00 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Salman Is Hot Says Sonam Kapoor

బాలీవుడ్ భామలు స్పందించే తీరే వేరు. తాము అనుకున్న హీరోల పక్కన నటించి, విజయాన్ని అందుకుంటే, ఇక హద్దే వుండదు. అందుకే, వరస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌ఖాన్‌ తో నటించాలని ప్రతి హీరోయిన్ కి వుండడం సహజం. ఆ విధంగా తహతహ లాడేవాళ్ళు ఎందరో .... అయితే సోనమ్‌కపూర్‌ ఆ అవకాశం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’తో దక్కించుకొంది. పైగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం కూడా అందుకొంది. అంతేకాదు సల్మాన్‌, సోనమ్‌ మధ్య 20 ఏళ్ల వయసు అంతరం ఉన్నా వారి మధ్య కెమిస్ట్రీ పండింది. ఇక ప్రచార కార్యక్రమాల్లోనూ ఈ జంట అందర్నీ అలరిస్తూ, మంచి మార్కులు కొట్టేస్తోంది. దీంతో సోనమ్‌ ఎక్కడికెళ్లినా సల్మాన్‌తో మీ జోడీ బాగుందని తెగ పొగిడేస్తున్నారట. సోనమ్‌ తాజా చిత్రం ‘నీర్జా’లోని పాటను ముంబయిలో ఓ కళాశాల విద్యార్థుల మధ్య ఆవిష్కరించారు. ఆ సమయంలో మీరు నటించిన కథానాయకుల్లో మీకు బాగా ఇష్టమైంది ఎవరని సోనమ్‌ను అడగ్గా... అక్కడున్న వారు సల్మాన్‌ అంటూ గట్టిగా అరవడంతో,సోనమ్‌ స్పందిస్తూ ‘‘అవును' అంటూ మురిసిపోయింది. 'మీరందరూ సరిగ్గానే చెప్పారు. నాకు సల్మాన్‌ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా హాట్‌’’ అని చెప్పిందామె. ఇక ‘నీర్జా’ గురించి స్పందిస్తూ, ‘‘ఇది యువతను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న చిత్ర మని చెప్పింది.

English summary

Bollywood Star Heroine Sonam Kapoor in an interview Says That Salman Khan Was her favorite hero and he was " Bloody Hot ".Sonam Kapoor says that her “Prem Ratan Dhan Payo” co-star Salman Khan was the best co-star