సల్మాన్‌ ఖాన్‌ ‘నో ఎంట్రీ’ ఎందుకన్నాడు

Salman Kashn Says No To No Entry Mein Entry

10:30 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Salman Kashn Says No To No Entry Mein Entry

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ 2005లో అనీజ్‌ బజ్మి దర్శకత్వం లో ‘‘నో ఎంట్రీ’’ అనే కామెడీ సినిమా తమిళ హిట్‌ సినిమా ‘‘చార్లీ చాప్లిన్‌’’ ఆధారంగా తీసాడు. ఈ సినిమాకు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి కథ సమకూర్చాడు. సల్మాన్‌ఖాన్‌, అనిల్‌కపూర్‌ నటించిన ఆ సినిమా కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టింది. ఇప్పుడు అనీస్‌ బజ్మి ‘‘నో ఎంట్రీ’’ సినిమాకు ‘‘నో ఎంట్రీ మే ఎంట్రీ’’ పేరుతో సీక్వెల్‌ నిర్మాణానికి సిద్ధపడ్డాడు. ఇందుకోసం స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు.

ఇందులో సల్మాన్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయం చేయాల్సివుంది. కానీ ప్రస్తుతానికి దర్శకుడు బజ్మికి సల్మాన్‌ఖాన్‌ ‘‘నో ఎంట్రీ’’ అన్నాడు. అయితే ‘‘నో’’ చెప్పడం దురుద్దేశ్యం లేదు. ఎందుకంటే సల్మాన్‌ బిజీ బిజీగా ఉన్నాడు. రంజాన్‌ పండుగ కానుకగా విడుదల కాబోయే ‘‘సుల్తాన్‌’’ సినిమా ముగింపు దశలో ఉంది. అలాగే కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో నిర్మించబోయే ఓ సినిమా, అతుల్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించే మరో సినిమా కథలపై చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అనీల్‌ బజ్మి సినిమాకి నో ఎంట్రీ ఇచ్చాడు. పైగా ఇది ద్విపాత్రాభినయ చిత్రం కనుక ఎక్కువ డేట్లు కేటాయించాల్సి వుంటుంది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌తోపాటు అనిల్‌కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ కూడా రెండేసి పాత్రలు పోషించాలి. ఇందులో హీరోయినెవరో ఇంకా నిర్ణయించలేదు. బహుశా బిపాసాబసు, లారాదత్తా నటించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి నో ఎంట్రీ కి ఎంట్రీ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.

ఆడియో 'ఎటాక్'

రోజా ఎప్పుడూ ఇంతేనా ...

పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

ఫేస్ బుక్ పరిచయంతో ఫ్రెండ్స్ తో కలిసి రేప్

మీనా కూతురే విజయ్ కూతురట

English summary

Bollywood Star Hero Salman Khan says no to the sequel of Boney Kapoores "NO Entry mein entry " movie.Because salman Khan was busy with his films and that's the reason behind he rejected that movies.