మ్యారేజ్  గురించి అడిగితే, నవంబర్ 18నే అంటున్నాడు

Salman Khan Announced His Marriage Date

11:02 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Salman Khan Announced His Marriage Date

మాములుగా తెలుగులో అయితే పెళ్లికాని ప్రసాద్ అని సరదాగా అంటారు. కానీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాకపోయినా ఇలాంటి నిక్ నేమ్ లు పెద్దగా లేవు. అయితే బాలీవుడ్ మోస్ట్ ముదురు బ్యాచిలర్ గా సల్మాన్ ని కొందరు అంటూంటారు. అయితే ఇంతకాలం ఎప్పుడెప్పుడా అని సల్లూభాయ్ అభిమానులు ఎదురు చూస్తున్న ఆ శుభ ఘడియలు వచ్చేసాయి. ఇప్పటికే సల్మాన్ లేటెస్ట్ మూవీ సుల్తాన్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రిలీజైన 12రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 490కోట్ల కు పైగా రాబట్టింది. దీంతో ఫుల్ జోష్ మీదున్న సల్మాన్ స్వయంగా తన మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేశాడు. నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. అయితే, ట్విస్ట్ ఏంటంటే, అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. ఇండియన్ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఆటో బయోగ్రఫీ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ సీన్ చోటుచేసుకుంది.

తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా మీ పెళ్లెప్పుడంటూ సాక్షాత్తూ సానియా పబ్లిగ్గా అడగడంతో, అసలు విషయం బయటకు వచ్చింది. 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ? ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడంతో ఆన్సర్ చెప్పాల్సిందేనని కోరింది. ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత తడబడి, నవంబర్ 18న అన్నాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కావున అదే తేదీన తాను కూడా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు వివరించాడు.

అయితే సానియా అంతటితో ఆగకుండా 'మీరు పెళ్లి చేసుకోకపోవడంపై ఆడాళ్లెవరూ మిమ్మల్ని అడగటం లేదా?' అంటూ కొంటెగా మరో ప్రశ్న సంధించింది. 'కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారో. ఇంతకీ వాళ్లెవరో కాదు, మా అమ్మ, చెల్లెళ్లు.. నేను పెళ్లిచేసుకోవాలని వారు అడుగుతున్నారు' అంటూ సల్లూ భాయ్ తాపీగా చెప్పాడు. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:ఆత్మగా నిహారిక!

ఇవి కూడా చదవండి:తారక్ అంటే ముఖ్యమంత్రి

English summary

Bollywood Most Senior Bachelor Salman Khan answered a question which was asked by Tennis Star Sania Mirza. Salman Said that he want to get married on November 18th because it was the day which his parents got married.