బిగ్ బి- షారూఖ్ లను మించిపోయిన సల్మాన్

Salman Khan As Highest Tax Payer In Bollywood

10:08 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Salman Khan As Highest Tax Payer In Bollywood

అవును, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌లను అధిగమించి న ఘనత ఇప్పుడు సల్మాన్ కి దక్కింది. 2015 ఆర్థిక సంవత్సరంలో బాలీవుడ్‌లో అత్యధిక సంపాదన చూస్తే , సల్మాన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 2015లో బజరంగీ భాయ్‌జాన్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించిన సల్మాన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు అయిపోయాడు.

తాజగా ముంబయి ఐటీ శాఖ వివరాలు వెల్లడించింది. వాటి ని పరిశీలిస్తే, 2014లో అక్షయకుమార్‌ రూ.16 కోట్లు పన్ను చెల్లింపుతో అగ్రస్థానంలో ఉంటే, 2015లో రూ.20కోట్లు అడ్వాన్స్‌ పన్ను చెల్లించి, సల్మాన్‌ ఏకంగా అక్షయ్‌ని అధిగమించాడు. సల్మాన్‌ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటూ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్న వారిలో రణ్‌బీర్‌ కపూర్‌(రూ.15 కోట్లు), షారుక్‌ ఖాన్‌(రూ.14కోట్లు), అమితాబ్‌ బచ్చన్‌(రూ.8.75 కోట్లు) ఉన్నారు. 2015 డిసెంబర్‌ వరకు విడుదలైన సినిమా వసూళ్ల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసిన ఐటీ శాఖ 2016 జనవరి నుంచి మార్చ్‌ వరకు విడుదలయ్యే సినిమాల ఆధారంగా ఓవరాల్‌ నివేదిక వివరాలను తర్వాత ప్రకటిస్తుంది. 015లో బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న సల్మాన్‌ ఈ ఏడాది సుల్తాన్‌ సినిమాతో మరోసారి తన స్థానాన్ని పదిల పరచుకోవడం ఖాయమని నిపుణులు ఇప్పటినుంచే అంచనా వేసెయ్యడం గమనార్హం.

English summary