'ఈగ 2' లో సల్మాన్ ఖాన్!

Salman Khan in Eega 2

03:11 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Salman Khan in Eega 2

‘బాహుబలి 2’ తర్వాత జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ‘ఈగ 2’కి సంబంధించిన పనులు ఇప్పటికే చకచకా జరిగిపోతున్నాయి. మరి ఇందులో హీరోగా నానినే కొనసాగుతాడా? లేదా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. ఎందుకంటే ‘ఈగ 2’లో నటించేందుకు హీరో సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. చెన్నై వెళ్లిన రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. తెలుగులో నానితో కంటిన్యూ చేసి, హిందీలో సల్మాన్‌ని తీసుకుంటాడా? లేదా తెలుగు, హిందీల్లోనూ సల్మాన్ చేస్తాడా అనే దాని పై క్లారిటీ రావాలి. మొత్తానికి 2017 లో ఈగ 2 సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు. గ్రాఫిక్స్ వండర్ గా పేరు తెచ్చుకున్న ఈగ కు కంటిన్యూగా తీస్తున్న సీక్వెల్ లో జక్కన్న ఎలాంటి సస్పెన్స్, మాయ చేస్తాడోనని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: 7 నిమిషాల సుఖానికి 50 % ఎక్స్ ట్రా కాస్ట్

ఇది కూడా చదవండి: చెన్నై కాలేజీలో అసభ్య నృత్యాలు

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో ఎక్కువగా అబద్దాలు చెప్పేది ఎవరో తెలిసిపోయింది!

English summary

Salman Khan in Eega 2. Bollywood body builder Salman Khan is in Eega 2. He gave green signal to act to Eega sequeal.