లిప్ లాక్ సీన్లో అనుష్కను ఇన్సల్ట్ చేశాడట

Salman khan insults Anushka sharma

11:21 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Salman khan insults Anushka sharma

మొత్తానికి చిన్నా.. చితకా, భారీ.. బడా సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామనైపోతున్నాయి. అసలు ఈ అంశం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదో పెద్ద మేటరైపోయింది. ఎందుకొచ్చిన గోలనుకుని హీరోయిన్లు కూడా మారం చేయకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ సీన్ నో అంటే నో అన్నాడట. అనుష్క శర్మ తో లిప్ లాక్ చేసే ప్రసక్తే లేదన్నడన్నది బాలీవుడ్ ఫిల్మ్ న్యూస్. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'సుల్తాన్' సినిమాలో హీరోయిన్ అనుష్క శర్మ తో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది. అయితే సెట్స్ లో డైరెక్టర్ లిప్ లాక్ సీన్ చెప్పగానే సల్మాన్ దానికి ఒప్పుకోలేదు. ఎంత నచ్చ చెప్పినా ససేమిరా అనడంతో చేసేది లేక డైరెక్టర్ డ్రాప్ అయ్యాడట. అయితే, కేవలం పైపైన పెదాలు ఆనించి లిప్ లాక్ ఎఫెక్ట్ వచ్చేలా సరిపెట్టారు.

అదికూడా సింగిల్ టేక్ లో క్లోజ్ చేయాలని సల్మాన్ ఖాన్ కండీషన్ పెట్టడంతో.. పైదంతా సల్మాన్ వెర్షన్ అయితే, అనుష్కశర్మ పరిస్థితిని ఎవరూ పట్టించుకోరా అనేది చర్చనీయాంశమైంది. పెద్ద హీరోలైనా, చిన్న హీరోలైనా లిప్ లాక్స్ కావాలంటే చేసి, వద్దంటే మానేయడమే తమపనా అని కొందరు హీరోయిన్లు తమ మనసులోని మాటను మనసులోనే అణచుకుంటున్నారు . ముందే వీటిపై డైరెక్టర్లు, హీరోలు ఒక నిర్ణయానికి వచ్చి షూటింగ్ కు ముందే ఆ విషయాన్ని తమకు తెలపాలని అంతేకాని, షూటింగ్ మధ్యలో మా ఎదురుగా ఈ పంచాయితీ ఏంటని మౌనంగా ప్రశ్నిస్తున్నారు. తమకూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటాయన్న విషయాన్ని గ్రహించాల ని అంటున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ చేసిన పని ఇన్సల్ట్ గా వుందని అనుష్క భావిస్తోందట.

ఇది కూడా చూడండి:మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

ఇది కూడా చూడండి:హీరోలు వారి మేనరిజం

ఇది కూడా చూడండి:ణుక్యుడు ఆత్మహత్య చేసుకున్నాడా ?

English summary

Sultan is an upcoming 2016 Indian sports-drama film directed by Ali Abbas Zafar. Salman Khan and Anushka Sharma in main roles. In this film one lip-lock scene is there in that scene Salman khan insults Anushka sharma.