జింకల కేసులో సల్మాన్ నిర్ధోషని తేల్చిన హైకోర్ట్!

Salman Khan is innocent in deers hunting case

03:41 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Salman Khan is innocent in deers hunting case

మరో కేసులో సుల్తాన్ కి ఊరట లభించింది. జింకల కేసులో అప్పీలుకు వెళ్లిన కండల వీరుడు నిర్దోషి అని తేలింది. దీన్ని బట్టి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కాలం కలిసి వచ్చిందా అంటే అవుననే విధంగా ప్రస్తుత పరిణామాలున్నాయి. ఓ పక్క వరుస హిట్లతో సినిమా కెరీర్ ఊపందుకుంటుంటే, మరోపక్క అతనిని వేధించిన జింకల కేసు నుంచి ఊరట పొందాడు.1998 అక్టోబరులో హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ కోసమని రాజస్థాన్ అడవుల్లోకి వెళ్లిన సల్మాన్, హీరోయిన్లు సోనాలీ బింద్రే, టబు, నీలమ్ లతో కలసి కృష్ణ జింకలను వేటాడాడంటూ అరోపణలు వచ్చాయి.

కేసు కోర్టుకి వెళ్ళింది. ఈ కేసులో సల్మాన్ మినహా మరెవరిపైనా ఆధారాలు లభ్యం కాకపోవడంతో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆతీర్పును సవాలు చేస్తూ, పై కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించిన సంగతి తెల్సిందే. కేసును విచారించిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ గోయల్ లతో కూడిన ధర్మాసనం, సల్మాన్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడుతూ సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడి హతమార్చాడన్న కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ, రాజస్థాన్ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో సల్మాన్ ఖుషీగా వున్నాడట. ఈ కేసుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కామెంట్స్ పేలిపోతున్నాయి.

English summary

Salman Khan is innocent in deers hunting case