100కోట్ల మార్కుకు దగ్గరలో సల్మాన్ కొత్త చిత్రం

Salman khan new film is close to hundred million club

02:19 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Salman khan new film is close to hundred million club

బాలీవుడ్ కండలవీరుడు దీపావళి సంబరాలను మరింత ముందుకు తీసుకుపోతున్నాడు. తన తాజా చిత్రం ప్రేమ్రతన్ దాన్ పాయో బాక్సాఫీస్ వద్ద కోట్లను తెచ్చిపెడుతోంది. దీపావళిరోజున దేశవ్యాప్తంగా విడుదలైనా ఈ చిత్రానికి మొదటినుండి భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి రోజున అంతగా కలెక్షన్లు లేకపోయినప్పటికీ మరుసటి రోజునుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందట ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకు 71కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. నవంబర్ 13 శుక్రవారం ఒక్కరోజే 31కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి, 100 కోట్ల మార్కును వారం రోజులలోపుగా సాధించేందుకు సిద్ధమైంది. విదేశాలలో కూడా విడుదల అయిన ఈ చిత్రానికి 10కోట్లకు పైగా ఓవర్సీస్ కలెక్షన్లు సాధించిందట. సల్మాన్ఖాన్ సరసన సోనమ్కపూర్ హీరోయిన్గా నటించగా, సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించాడు

English summary

Salman khan new film is close to hundred million club.salman khan famous bollywood actor.