చెర్రితో సల్మాన్ సినిమా

Salman Khan to Make Movie With Ram Charan

05:19 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Salman Khan to Make Movie With Ram Charan

ఒక భాషలో పేరున్న కథానాయకులు మిగతా భాషలకి తమ పరిధి పెంచుకోవటం కొత్త విషయమేం కాదు. మనదేశంలో బాలీవుడ్ మార్కెట్ స్థాయి ఏంటో తెలిసిందే. అందుకే దక్షిణాది స్టార్ హీరోలు అక్కడా జెండా ఎగరేయాలని ఆశపడుతుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాదు. ఇంతకీ విషయానికొస్తే అమితాబ్ ‘జంజీర్’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడట. మొదటి ప్రయత్నం బెడిసి కొట్టినా ఈ సారి అక్కడ విజయపతాక రెపరెపలాడించాలన్న ధ్యేయంతో ఉన్న చరణ్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టేశాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నిర్మాతగా వ్యవహరించే అవకాశముందట. కథ, దర్శకుడి వివరాలు వెల్లడి కానప్పటికీ బాలీవుడ్‌లో ఓ సినిమా ఉంటుందని అక్కడి మీడియాతో ఓ సందర్భంలో చరణ్ చెప్పుకొచ్చాడట. మరి ఇది కార్యరూపం దాలిస్తే, మెగాభిమానులకి పండగ కాక మరేమిటి?

ఇవి కూడా చదవండి:

దర్శకులపై నోరు జారిన విష్ణు

జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

English summary

Bollywood Star Hero was going to made a film with Mega Power Star in Bollywood. This was said by Ram Charan in an Interview.