సోనం కపూర్ పై   సల్మాన్ పొగడ్తల జల్లు

Salman Praises Sonam Kapoor

06:49 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Salman Praises Sonam Kapoor

బాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు అంతా మీకు స్ఫూర్తి ఎవరని అడిగితే అందరూ టక్కున చెప్పే పేర్లు మాధురి దీక్షిత్ , ఐశ్వర్యరాయ్, శ్రీదేవి. అయితే ఇదే ప్రశ్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ని అడిగితే సోనమ్ కపూర్ అని అంటున్నాడు. ఐశ్వర్య , మాధురి , శ్రీదేవి లను మించిపోయే అందం సోనమ్ కపూర్ దని సెలవిస్తున్నాడు ఈ బాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఈ జంట ప్రేమ్ రతన్ ధన పాయో చిత్ర ప్రమోషన్లో పాల్గొంటున్నారు . ప్రమోషన్ లో భాగంగా విలేకరి అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఇలా బదులిచ్చాడు . ఈ యువ కథానాయికని ఇంతలా పొగడడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రేమ్ రతన్ ధన పాయో చిత్రాన్ని తెలుగులో ప్రేమ్ లీలగా అనువదించి రిలీజ్ చెయ్యనున్నారు . ఈ చిత్రం లో సల్మాన్ పాత్రకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం విశేషం .

English summary

Salman Praises Sonam Kapoor