ఛాన్స్ లు రావడం లేదని ... రూటు మార్చింది

Saloni Acts With Comedian

11:15 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Saloni Acts With Comedian

సినిమాల్లో వేషాలు వచ్చినంతకాలం పర్వాలేదు. ఏమి చేసినా చెల్లుతుంది. అదే అవకాశం రాకపోయే సరికి ఏం చేయడానికైనా తెగిస్తారు. టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం తన అందాలతో కుర్రకారుకు వేడి పుట్టించిన హీరోయిన్ సలోని కూడా అదే కోవలో కి వచ్చేసింది. ఒక మోస్తరుగా అందాలు ఆరబోసినప్పటికీ పెద్ద హీరోలతో అవకాశాలు పొందలేకపోయిన ఈ అమ్మడు రూటు మార్చింది.

జక్కన్న తీసిన మర్యాద రామన్నతో హిట్ వచ్చినా, భారీ ఆఫర్లు మాత్రం ఈ అమ్మడు తలుపు తట్టలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఈ భామ.. ఒక కమెడియన్ కు జంటగా నటించడానికి ఓకే చెప్పేసింది. ఆ కమెడియన్ ఏ అలీనో, వేణమాధవో కూడా కాదు. ఇటీవల తన టైమింగ్ పంచ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ప ృథ్వీ అట. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో పృథ్వీకి జోడీగా సలోనిని ఆ చిత్ర నిర్మాతలు ఎంపిక చేశారట. ఎందుకంటే, రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులు కోవడం ఎందుకులే అని సలోని ఈ ఆఫర్ కి ఒకే చెప్పేసింది వార్తలు వస్తున్నాయి. ఇక, సలోనితో సరసాలాడే బంపర్ ఆఫర్ కొట్టేసిన పృథ్విని చూసి చాలామంది తెగ బాధ పడిపోతున్నారట. ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపగలరు మరి చెప్పండి.

ఇది కూడా చూడండి: చేతబడి గురించి భయంకర నిజాలు

ఇది కూడా చూడండి: లేడీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలు ఇవే

ఇది కూడా చూడండి: మగవాళ్ళు గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

English summary

Beautiful tollywood heroine Saloni Acts With Comedian.