కృష్ణవంశీతో సమంత ....

Samanta To Act Under Krishna Vamsi Direction

10:03 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Samanta To Act Under Krishna Vamsi Direction

ఒక్కో కాంబినేషన్ ఎందుకు ఎలా ఏర్పడుతోందో చెప్పలేం. అలాగే ఇప్పుడు దర్శకుడు కృష్ణవంశీ తాజా సినిమాలో సమంత నటించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే తొలిచిత్రం ఇదే అవుతుంది. వాస్తవానికి అనుష్క నటించాల్సి వున్నా, అనూహ్యంగా సమంత కు చాన్స్ వచ్చింది. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత నేటివరకు కృష్ణవంశీ నుండి మరో సిన్మా రాలేదు. అయితే ఈ దర్శకుడు అనుష్క ప్రధాన పాత్రగా ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ఈ విషయం గత కొద్దికాలంగా వినవస్తోంది. ఓ ప్రముఖ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా, సెట్స్ మీదికెళ్ళడమే తరువాయి. ఈ తరుణంలో అనుష్క స్థానంలో సమంత వచ్చి చేరింది. సింగం3, బాహుబలి సినిమాలతో అనుష్క బిజీగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతేడాది తెలుగు తెరకు మొహం చాటేసిన సమంత, కృష్ణవంశీ కథ నచ్చడంతో 'ఎస్' చెప్పేసిందట. అనుష్క, సమంతలిద్దరికీ కృష్ణవంశీతో ఇదే మొదటి సినిమా. అయితే అనుష్క డేట్లు సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో సమంత చేరింది. మరి హీరో ఎవరు తదితర అంశాలు తేలాల్సి వుంది.

English summary