మరోసారి ఆ తప్పు చేయకుండా...

Samantha About Critics

09:35 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Samantha About Critics

హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ అందాల భామ సమంత ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’, ‘అ ఆ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఏవైనా విమర్శలు వస్తే, జాగ్రత్త పడతానని చెప్పే ఈ ముద్దుగుమ్మ సినీ విమర్శకుల కు సుతిమెత్తగా చురక వేసింది. ‘‘తొలినాళ్లలో నా నటన మెరుగు పర్చుకోవడానికి ఓ విధంగా విమర్శకుల సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. విమర్శలు మంచివే. మన తప్పుల్ని మనకు చూపించే అద్దం లాంటిది విమర్శ. సినీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ విమర్శకులు ఉంటారు. అయితే సినీ విమర్శకులు మాత్రం ప్రత్యేకం. మనం చేసే ప్రతి పనినీ క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు. వ్యక్తిగతం, వృత్తిగతం రెండూ వేర్వేరు. కానీ... వాళ్లకు అదేం పట్టదు. అంతెందుకు? నాకు నేనే పెద్ద విమర్శకురాల్ని. నా పని నాకు నచ్చకపోతే అందరికంటే ఎక్కువగా నాకు నేనే తిట్టుకొంటా.. ఒక్కోసారి నా విమర్శను నేనే భరించలేను. మరోసారి ఆ తప్పు చేయకుండా నన్ను కాపాడేది కూడా ఓ విధంగా అదే’’ అని వివరించింది. ఇంతకీ ఏ సినీ విమర్శకుని విమర్శ సమంత ను బాధ పెట్టిందో, లేకపోతే ఇంత క్లాస్ పీకుతుందా ఏమిటి ?

English summary

At present tollywood top actress Samantha was acting in Mahesh Babu's Brahmotsavam and A..Aa.. movie with hero nithin .Samntha says that at the starting of her carrer some of the critics have made comments on her and she says that critics was soo useful to her in her carrer.