కాలేజీ రోజుల్లో సూర్య  అభిమానిని

Samantha About Surya

10:44 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Samantha About Surya

ఒక్కో హీరోని టచ్ చేసినా, తనకు ఏ హీరో ఇష్టమో, ఏ హీరోయిన్ ని ఎక్కువగా ఇష్ట పడతాడో చెప్పేస్తాడు. అలాగే హీరోయిన్ కదిపినా.... ఎందుకంటే వాళ్ళ కాలేజ్ డేస్ లో ఉన్నప్పడు సినిమాలు చూడడం , ఫలానా హీరో హీరోయిన్ లని లైక్ చేయడం , వారి కోసం పిచ్చ పిచ్చగా ఎదురు చూడడం చేసే వూంటారు. ఇక నటి 'సమంత' విషయానికొస్తే, ఆమె అభిమాన నటుడు సూర్య అట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్యూలో చెప్పింది. ' కాలేజీ రోజుల్లో... నా అభిమాన కథానాయకుడు సూర్యనే. ఒకసారి మా కాలేజీ వార్షికోత్సవానికీ వచ్చారు. సూర్యని చూడగానే ఆగలేక ‘సూర్య.. సూర్య..’ అంటూ అరచిగోల పెట్టా. ఇప్పుడు అవన్నీ తలచుకొంటుంటే నవ్వొచ్చేస్తుంది. పైగా నా అభిమాన నటునితో కల్సి యాక్ట్ చేయడం ఇంకా త్రిల్ గా అనిపించింది' అంటూ 'సమంత చెప్పుకొచ్చింది.

సూర్యతో కల్సి నటించినపుడు ఎంతో సంతోషం కల్గిందని సమంత అంటోంది. అందరితోనూ ఇట్టే కలిసిపోయే వ్యక్తిత్వం సూర్యది. మనసులో ఎలాంటి ఈగోలూ ఉండవు. ప్రతీ మాటా ఆచితూచి మాట్లాడతారు. తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అన్నది ఆయన ఉద్దేశం. ఆయన సినిమాలన్నీ చూస్తుంటా. ఓ అభిమానిగా ఆయన్ని ఆరాధించిన నేను ఆయన పక్కన కలసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ సూర్య గురించి మొత్తం చెప్పేసింది.

English summary

One of the South India Top Heroine Samantha Praises Hero Surya.Samantha Says that during her college days Hero Surya Visited her college as Chief Guest to an event.Then she was big fan of Surya. Later she was acted as heroine with surya and she says that was her wonderful experience