చిన్నారులకు సమంత చేయూత..

Samantha adopted 100 children and arranging food for them

01:35 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Samantha adopted 100 children and arranging food for them

అందాల నటి సమంత అందంలోనే కాదు మనసులో కూడా చాలా అందమైనది. అందుకే ఎప్పుడూ సేవాకార్యక్రమాల్లో ముందుంటుంది. తెలుగు, తమిళం ఈ రెండు భాషల్లో నాలుగు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇంత బిజీగా ఉన్నా తన ప్రత్యూష ఆర్గనైజేషన్‌ సేవల్ని కొనసాగిస్తూనే ఉంది. డిసెంబర్‌ 1 అంటే ఎయిడ్స్‌ డే సందర్భంగా సమంత సేవాకార్యక్రమాల కోసం ముందుకొచ్చింది. ఎయిడ్స్‌ సోకిన 100 మంది చిన్నారులకు పోషకాహారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తల్లిదండ్రుల తప్పుల వల్ల ఏ పాపం ఎరుగని ఈ చిన్నారులు బలైపోతున్నారు.

ఈ చిన్నారులకు ఆహారం సమస్య కాకూడదు అందుకే నా వంతు సాయంగా 100 మంది చిన్నారులకు ఆహారం అందిస్తున్నా అని తెలియజేసింది. ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా ఈ సాయం అందుతుందని సమంత తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది. తల్లిదండ్రులే డబ్బు సమస్య వల్ల పిల్లల్ని సరిగా పట్టించుకోని ఈ రోజుల్లో సమంత ఇలా ముందుకొచ్చి సాయం చెయ్యడం చాలా గొప్ప విషయం. సమంతతో పాటు స్టార్‌ హీరోయిన్లు తమన్నా, శృతిహాసన్‌, కాజల్‌, నయనతార, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా ముందుకొచ్చి తలో 100 మందిని దత్తత తీసుకుంటే ఎంతో బాగుంటుంది కదా!!

English summary

Samantha adopted 100 children and arranging food for them. And donated to Prathyusha Organtisation.