నాలుగోసారి జత కట్టబోతున్న ఎన్టీఆర్‌, సమంత!!

Samantha again pairing with Jr.Ntr

03:30 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Samantha again pairing with Jr.Ntr

'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘాటింగ్‌ అయిపోయాక ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి పెద్దనాన్నగా మలయాళ సూపర్‌స్టార్‌ 'మోహన్‌లాల్‌' నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇంకా టాప్‌ టెక్నిషియన్స్‌ తిరు, దేవిశ్రీప్రసాద్‌ కూడా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నాలుగో సారి సౌత్‌ ఇండియన్‌ బ్యూటీ 'సమంత' జత కట్టనుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌-సమంత జంటగా బృందావనం, రామయ్యావస్తావయ్యా, రభస సినిమాల్లో నటించారు.

తాజాగా మరోసారి ఈ చిత్రంలో కూడా సమంత నటించబోతుంది, కొరటాల శివ చెప్పిన కధ నచ్చడంతో సమంత వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary

Samantha again pairing with Jr.Ntr in Koratala Siva directing movie.