వావ్, వీళ్ళిద్దరూ ఇలా..

Samantha and Naga Chaitanya in traditional look

12:41 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

Samantha and Naga Chaitanya in traditional look

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా అక్కినేని నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో చైతన్య, సమంత పక్కపక్కన కూర్చొని ఉన్న దృశ్యం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. అందుకే చూడచక్కని జంట, మీ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం, మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు చాలా బావున్నాయ్! మా కోసం ఇంకొన్ని షేర్ చేయ్యి సమంత.. ఇలా వివిధ రకాలుగా స్పందించారు. బుధవారం చైతన్య పుట్టినరోజు పురస్కరించుకుని వీరిద్దరు కలిసి గోవా వెళ్లినట్లు టాక్. ఒక్కటి మాత్రం నిజం వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోనున్నారు.. పెద్దలు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రేపోమాపో ముహూర్తం డేట్ కూడా రానుంది. రానున్న కాలంలో ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి? ఎవర్ని ఎలా గౌరవించుకోవాలి? పిల్లల్ని ఏం చదివించాలి? ఇద్దరు కలిసి సినిమాలు చేద్దామా? తీద్దామా? అన్నట్టుగా వుంది ఈ ఫోటో అంటున్నారు.

English summary

Samantha and Naga Chaitanya in traditional look