చైతూ - సమ్మూ ల ఫోటోలు హల్ చల్

Samantha and Naga chaitanya photos in social media

11:30 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Samantha and Naga chaitanya photos in social media

నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం పెళ్లి పీటలకు చేరడానికి మార్గం సుగమం అయిందని తెల్సిందే కదా. అయితే ఈ అంశం గురించి కొంచెం పక్కనబెడితే.. వీళ్లకు సంబంధించి ఇప్పుడు రకరకాల ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య థియేటర్, బాల్కనీ లో కనిపించిన ఈ జంట, తాజాగా బంజారా హిల్స్ లోని జీవీకే మాల్ లో హార్డ్ రాక్ కేఫ్ దగ్గర నిలుచున్న పిక్ ఒకటి సోషల్ మీడియా లో తెగ తిరిగేస్తోంది.

ఇందులో చైతూ ఒక్కడే క్లియర్ గా కనిపిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో? ఏంటో? ఎక్కడ క్లియర్ గా లేకపోయినా వెబ్ సైట్ లలో మాత్రం సామ్-చైతూలే అంటూ తాటికాయంత అక్షరాలతో రాసుకొస్తున్నారు. ఎవరో కావాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. వీళ్ల ఫోటోలు బయటకు వచ్చినదగ్గర నుంచి ఎన్నో వార్తలు, మరెన్నో గాసిప్స్. రేపటిరోజున ఇంకెన్ని ఫోటోలు బయటకు వస్తాయో! ఇదిలావుండగా ప్రేమ యవ్వారం గురించి ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్టేట్ మెంట్ ఇవ్వలేదు.. మొత్తానికి ఈ తతంగం ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఎందుకంటే సమంతకు కుజ దోషం అని జ్యోతిషులు చెప్పినట్లు ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి.

ఇది కూడా చూడండి: ఆ నాలుగు చోట్ల సెల్‌ఫోన్‌ పెట్టుకోకూడదట

ఇది కూడా చూడండి:రాత్రి పడుకొనే ముందు చేయవలసిన 10 పనులు

ఇది కూడా చూడండి: నాగార్జున ఆస్తి ఎంతో తెలిస్తే షాకౌతారు

English summary

Samantha and Naga chaitanya photos Halchal in social media.