'చైతూ-సమ్ము ' బెల్జియం చెక్కేసి, ఆపై ...

Samantha And Naga Chaitanya Trip To Belgium

11:21 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Samantha And Naga Chaitanya Trip To Belgium

సమంత- నాగచైతన్య గురించి ఓ కొత్త న్యూస్ తాజాగా వైరల్ అయింది. లవ్ ఎఫైర్ తో వార్తల్లో వున్న ఈ జంట బెల్జియం చెక్కేశారన్నది లేటెస్ట్ వార్త. వున్నట్లుండి ఫారెన్ కు ఎందుకు వెళ్లినట్టు? వీళ్ల వెనుక ఎవరున్నారు? అసలేం జరుగుతోంది. బ్రీఫ్ గా చీటికిమాటికీ ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో సమంత టచ్ లో వుండడం, మ్యారేజ్ గురించి వాళ్లు పదేపదే ప్రశ్నలు లేవనెత్తడం అంశాలు ఇబ్బందిగా మారడం గమనించిన నాగార్జున, సమ్ముకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి.

దీంతో చైతూ-సమ్ము బాధను అర్థం చేసుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ స్కెచ్ వేసి ఈ జంట ను కలిపేందుకు ప్లాన్ చేశారట. రవితేజ, రానా, రకుల్, రెజీనా, నీరజ కోన వంటి నటీనటులు ఈ జంటతో బెల్జియం ట్రిప్ వేశారు. ఈ టీమంతా బెల్జియంలో అడుగుపెట్టేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను మిగతా హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇంతవరకు బానే వుంది. ఇందులో చైతూ-సామ్ ఒక్కచోట వున్నట్లు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. జంటగా ఎక్కడ కనిపిస్తే మళ్లీ గాసిప్స్ పుట్టుకొస్తాయని భావించి విడివిడిగా ఫొటోలకు ఫోజు ఇచ్చినట్లు సరిపెట్టేసారు. వీళ్లంతా కలిసి ఈ జంటను కలిపేందుకు బెల్జియం టూర్ ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ జంట బెల్జియం ట్రిప్ లో ఏవిధమైన సంచలనం సృష్టించనుందో.

ఇది కూడా చూడండి: మిమ్మల్ని పోలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

English summary

Samantha And Naga Chaitanya Trip To Belgium.