ఏమాయ చేసిందో వేల కోట్లకు అధిపతి!

Samantha becoming billionaire

11:47 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Samantha becoming billionaire

తెలుగువారికి ఎన్నో సామెతలున్నాయి. అందులో తంతే బూరెల బుట్టలో పడ్డాడు అనే సామెత కూడా తెల్సు కదా. అదృష్టం అమాంతం కాల్సివస్తే ఈ సామెత వర్తిస్తుంది. అయితే హీరోయిన్ సమంతను చూస్తే ఈ సామెత సరిపోతుంది. తంతే వేల కోట్లలో పడొచ్చు అని చెబుతోంది. అదెలా అంటే.. సమంతను చూస్తే చాలు. ఈమె వేల కోట్లకు అధిపతి అయిపోతోంది. సమంత కూడా ఇలా ఎప్పుడూ ఊహించి వుండదు. హీరోయిన్ అవుతానని ఊహించి వుండదు. ఒకవేళ ఊహించినా.. స్టార్ హీరోయిన్ అవుతానని అనుకుని వుండదు. ఇవన్నీ ఏదో సరదాగా అనుకుని వున్నా.. వేల కోట్లకు మహారాణి అవుతానని అస్సలు ఊహించి వుండదు.

ఈ వేల కోట్లకు కారణం అక్కినేని వారబ్బాయిని ప్రేమించడమే. ఐదేళ్ల క్రిందటే గౌతమ్ మీనన్ ఏమాయ చేసావె అంటూ సమంతతో సినిమా తీశాడు. ఈ మాయలో చైతూ పడిపోయి.. నువ్వేకావాలి.. నువ్వులేక నేనులేను అంటూ.. నిజ జీవితంలో పాటలు పాడుకున్నాడు. రేపేమాపో పెళ్లి చేసుకుని అక్కినేని సామ్రాజ్యంలోకి అడుగుపెడుతోంది సమంత. తండ్రీకొడుకులు ఏఎన్నార్, నాగార్జున అక్కినేని సామ్రాజ్యాన్ని వేల కోట్లతో విస్తరించారు. దీనికి వారసులు చైతూ, అఖిల్. సగం సగం చేసుకున్నా... ఒక్కొక్కరికి వచ్చే ఆస్తి విలువ వేల కోట్లల్లో వుంటుందని అంటున్నారు.

అదృష్టమంటే సమంతదే. అక్కినేని ఫ్యామిలీ నుంచే కాదు.. దగ్గుబాటి ఫ్యామిలీ ఆస్తిలో కూడా చైతూకు వాటా వుంది. వెంకటేశ్ అక్క కొడుకే చైతూ. అలా కూడా కోట్లల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సమంత జాతకురాలేనని అందుకే పుట్టకతో శ్రీమంతుడైన చైతూ ప్రేమలో పడిందని అంటున్నారు.

English summary

Samantha becoming billionaire