మతం మార్చుకున్న సమంత!

Samantha changed her community

10:56 AM ON 27th September, 2016 By Mirchi Vilas

Samantha changed her community

ఇన్నాళ్లూ ప్రేమ - పెళ్లి గురించి విస్తృతంగా వార్తల్లో చోటు చేసుకున్న నటి సమంత ఇప్పుడు మరో అంశం గురించి వార్తల్లోకి వచ్చింది. తాజాగా సమంత హిందూమతంలోకి మారిందని, నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించినవంటూ రెండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. జన్మతః క్రిస్టియన్ అయిన సమంత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో వేదపండితులు నిర్వహించిన క్రతువు ద్వారా హిందూమతంలోకి మారారని వినిపిస్తోంది. ఈ క్రతువు సందర్భంగా సమంత సరసన నాగచైతన్య కూర్చోగా, దీనికి నాగార్జున సైతం హాజరైనట్లు ఫోటోలు తెలియజేస్తున్నాయి.

అయితే ఈ క్రతువు మత మార్పిడికి సంబంధించిందా, కాదా అనే విషయంపై నాగార్జున కుటుంబం పెదవి విప్పలేదు. స్వతహాగా తనకు సంబంధించిన విషయాల్ని ట్విట్టర్ వేదిక ద్వారా వ్యక్తంచేసే సమంత కూడా దీనిపై మౌనం వహించారు. వచ్చే ఏడాది నాగచైతన్య, సమంత వివాహం జరుగుతుందని, నాగార్జున స్వయంగా ప్రకటించిన కొద్ది రోజులకే సమంత మత మార్పిడి అంశం ప్రచారంలోకి గమనార్హం. ఇక పెళ్లి బాజాలు మోగడమే తరువాయి!

ఇది కూడా చదవండి: పెళ్లి గురించి కాజల్ షాకింగ్ కామెంట్స్!

ఇది కూడా చదవండి: 'బతుకు జట్కాబండి' జీవితపై కేసు

ఇది కూడా చదవండి: వామ్మో.. లింగుస్వామి సినిమాకి బన్నీ పారితోషకం అంతా..?!

English summary

Samantha changed her community. Hot beauty Samantha Ruthu Prabhu changed her community for marrying Naga Chaitanya. Actually Samantha is Christian but now she changed her community to Hindu.