'నేనే విన్నర్, చైతూ లూజర్' అంటూ చీట్ చేసిన సమంత!

Samantha cheated Naga Chaitanya in badminton game

12:10 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Samantha cheated Naga Chaitanya in badminton game

ఇదేమిటి, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్ళిపీటల మీదికి రాబోతున్నారు కదా? అలాంటిది, సమంత.. చైతూను చీట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా! ఏ విషయంలో చీట్ చేసిందన్న విషయం క్లారిటీగా తెలియాలంటే, వివరాల్లోకి వెళ్లాల్సిందే.. సమంత, నాగచైతన్య లవ్ బర్డ్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ లవ్ బర్డ్స్ ఆడిన షెటిల్ లో విన్నర్ గా సమంత, రన్నర్ గా చైతూ నిలిచారు. ఈ గేమ్ కు సంబంధించిన ఓ ఫోటోను సమంతా తన ట్విట్టర్ లో పెట్టింది. ఇందులో సమంత ఆడి ఆడి గెలిచి అలిసిపోయి పడిపోయినట్లుగా విన్నర్ నేనే అంటూ పేర్కొంది. సమంత ట్వీట్ చేసిన ఫోటోలో సమంత ఉన్న దగ్గర విన్నర్ అని చైతూ ఉన్న దగ్గర రన్నర్ అని రెడ్ కలర్ అక్షరాలతో రాసింది.

అంతటితో ఆగని సమ్.. బూ హ హ హ హ హ.. అంటూ నాకు పీవీ సింధు స్పూర్తి అని ట్విట్టర్ లో తెలిపింది. ఈ ట్వీట్ కు పలువురు స్పందించారు. ఈ ట్వీట్ కు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వెంటనే స్పందించారు. హ హ హ గెలిచినందుకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. నేను చీట్ చేశాను అని సమంత జ్వాలాకు రిప్లై ఇచ్చారు. అంటే.. ఆటలో చైతన్య గెలిచినట్లు పరోక్షంగా బయటపెట్టింది సమంత. కాగా లవర్స్ ఇద్దరికి వచ్చే ఏడాది వివాహం జరగనుంది.

English summary

Samantha cheated Naga Chaitanya in badminton game