వరుడి ఫ్యామిలీకి ఇంకా ఏం నచ్చాలి?

Samantha clarity about her love affair

04:03 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Samantha clarity about her love affair

సమంత, నాగచైతన్యల పెళ్ళి త్వరలోనే జరగబోతోందన్న వార్తలు బాగా వినపడుతున్న ఈ సమయంలో సమంత నోటి నుంచి వచ్చిన మాటలు అందరినీ అయోమయంలో పడేస్తున్నాయి. అసలు వీరిద్దరి పెళ్ళి జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే, వచ్చే సంవత్సరం వరకూ తాను సింగిల్ గానే ఉండదలుచుకున్నట్టు ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సమంత అందట. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా అదే అర్థం వచ్చేట్టు మాట్లాడడంతో ఇప్పుడు ఆమె పెళ్ళి మీద అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

సినీ ప్రేక్షకులను తన మాయలో పడేసుకున్న సమంత కాబోయే వరుడి ఫ్యామిలీ మనసు ఇంకా దోచుకోలేకపోయిందనీ, దీనికి కొంత సమయం కావాలని, అందుకే పెళ్ళి వాయిదా వేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో సమంత ఉందని సినీ లవర్స్ అంటున్నారు. అయితే ఇంతవరకూ పెళ్ళి వార్తల మీదే సమంత క్లారిటీ ఇవ్వలేనందున, ఈ పెళ్ళి వార్తలు, వాయిదా వార్తలు అన్నీ రూమర్సేనని కొట్టిపారేస్తున్నారు సినీ జనాలు. మొత్తానికి సమంత లవ్ ఎఫైర్ ఎప్పుడు ముగుస్తుందో అప్పటిదాకా రూమర్లే షికారు చేస్తాయి.

English summary

Samantha clarity about her love affair