అబ్బా , 8 నెలలుగా రెస్ట్ లేదంటున్న సమంత

Samantha Comments On 24 Movie

10:16 AM ON 11th May, 2016 By Mirchi Vilas

Samantha Comments On 24 Movie

ఎనిమిది నెలలుగా విశ్రాంతి లేకుండా వరుస షూటింగ్‌లలో పాల్గొంటున్నానని కథానాయకి సమంత అన్నారు. ఇటీవల విడుదలైన ‘24’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘సమ్మర్‌లో వరుసగా నాలుగు (పోలీస్‌, 24, బ్రహ్మోత్సవం, అ..ఆ) సినిమాలు ఉన్నాయి. విభిన్న కథలతో కూడుకున్న ఈ చిత్రాల్లో నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది’ అంది. తరువాత సూర్యతో జంటగా నటించిన ‘24’ గురించి చెబుతూ, ‘24 కథ వింటున్నప్పుడు ఈగ సినిమా గుర్తొచ్చింది. ఇంత చిన్న ఈగను ఎలా స్క్రీన్‌పై చూపిస్తారని అప్పుడు అనిపించింది. కాలంతో కూడుకున్న ‘24’ కథను ప్రజలకు అర్థమయ్యేలా ఎలా తీస్తారనే సందేహం కలిగింది.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

దర్శకుడు విక్రమ్‌కుమార్‌ సినిమా చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నా పాత్ర చిన్నది కావచ్చు. కానీ ఈ సినిమాలో నేను ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో నేను లవ్‌ట్రాక్‌లో కనిపిస్తా. ఆ ట్రాక్‌ చాలా క్యూట్‌గా ఉంటుంది. కథ చాలా ఆసక్తిగా సాగుతున్న సమయంలో నాతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులకు రిలీఫ్‌ ఇస్తాయి. కొత్తగా ఏ సినిమా ఒప్పుకోలేదు. గత ఎనిమిది నెలలుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నా. కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయడానికి ఒప్పుకోను. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్‌’లో నటిస్తున్నా. దాని తరువాత కన్నడ సినిమా ‘యూటర్న్‌’ రీమేక్‌లో నటిస్తున్నా’ అని వివరించింది.

ఇక ‘బ్రహ్మోత్సవం’ ఆడియోలో మహేశ్‌బాబు కుమార్తె సితారతో చాలా క్లోజ్‌గా కనిపించిన ఘటన పై సమంత స్పందిస్తూ ‘మేము మంచి ఫ్రెండ్స్‌. సితార నవ్వు, డ్యాన్స్‌ సూపర్‌గా ఉంటాయి. మహేశ్‌బాబులా సితార కూడా మంచి స్టార్‌గా ఎదుగుతుంది. గౌతమ్‌, సితార ఫీచర్‌స్టార్స్‌’ అని జోస్యం చెప్పింది. మొత్తానికి ఈ సమ్మర్ లో సమంత సినిమాలు వరుస పెట్టి సందడి చేయబోతున్నాయి.

ఇవి కుడా చదవండి:ప్రాణం తీసిన ఫుడ్‌ ఎలర్జీ...

ఇవి కుడా చదవండి:అ..ఆ..ని వెంటాడుతున్న బ్రహ్మోత్సవం

English summary

South Top Heroine Samantha Says that She was participating in Movies continuously from 8 months. She was busy with Brahmotsavam,24,A..Aa..,Police movies. She says that 24 movies was a very good film and Director Vikram K Kumar make this film very nicely and she was very happy to be a part of 24 movie.