సమంతా ప్రేమకథ చీర ... ఎలా తయారు చేశారో తెలుసా?

Samantha engagement saree embroidered with her Love story

06:37 PM ON 31st January, 2017 By Mirchi Vilas

Samantha engagement saree embroidered with her Love story

సెలబ్రిటీలు, సినీ స్టార్స్ ఏమి చేసినా ఆశ్చర్యంగానే ఉంటుంది. వాళ్ళు చేసే పనులు అందరి నోళ్ళల్లో నానుతుంటాయి. కథలు కథలుగా చెప్పుకుంటారు. సరిగ్గా ఇప్పుడు సమంత నిశ్చితార్థం చీర గురించే ప ్రతికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా చెప్పుకుంటున్నారు. ఆమె ప్రేమకథని, చిత్రాలుగా చీరపై పొందిగ్గా పరిచి.. అందంగా డిజైను చేసింది ఎవరో తెలుసా? ముంబయికి చెందిన డిజైనర్ క్రేషా బజాబ్ దీన్ని రూపొందించట. నిజానికి ఈ ట్రెండ్ కి ఏడాది క్రితమే క్రేషా తెరతీసింది. ఆమె తన వివాహం సందర్భంగా ప్రత్యేక లెహెంగా రూపొందించుకోవాలనుకుంది. ఆ సమయంలోనే ఆమెకి అమెరికాకు చెందిన వ్యాపార ప్రముఖురాలు, చిన్నితెర నటి అడ్రియన్ మలూఫ్ భర్త చివరి జ్ఞాపకార్థంగా వాళ్ల పెళ్లి దుస్తుల్ని ఫ్రేమ్ చేయించి పెట్టుకుందని తెలిసింది. తన పెళ్లి దుస్తుల్ని కూడా అలాగే ప్రత్యేకంగా జీవితాంతం దాచి పెట్టుకోవాలనుకుంది క్రేషా. ఆమె తన భర్త వనరాజ్ పరిచయం నాటి నుంచి పెళ్లి వరకూ జరిగిన పలు సంఘటనల్నీ, సందర్భాలనీ, చిత్రాలనీ సీక్వెన్లూ, పసిడి పూసలూ, ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై గుదిగుచ్చింది. ఇందుకోసం దాదాపు పదిలక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. నెలపాటు.. వంద మంది ఈ లెహెంగాను డిజైన్ చేశారు. అలా తన పెళ్లితో సంచలనం సృష్టించిన క్రేషా గతేడాది నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పెళ్లికూతుళ్లకు ఈ తరహా దుస్తులను రూపొందించింది. వీటి ధర మూడున్నర లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకూ ఉంటుంది. క్రేషా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చదివి.. ముంబయిలో ప్రత్యేకంగా ఓ బ్రాండ్ ను ప్రారంభించింది. దాని ద్వారా పెళ్లికూతుళ్లకు ప్రత్యేకంగా దుస్తుల్ని డిజైన్ చేయడమే కాదు.. 233 దేశాలకూ వాటిని పంపుతోంది. అలా క్రేషా తాజాగా సమంత నిశ్చితార్థం చీరని డిజైను చేసి తెలుగురాష్ట్రాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. మరింతమంది క్రెషా దగ్గరకు క్యూ కడుతున్నారట.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

Samantha engagement saree was embroidered with her starry love story.