పెళ్ళైనా ఆపేది లేదు... మరో ట్విస్ట్ ఇచ్చిన సమంత!

Samantha gave a twist about her marriage

11:02 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Samantha gave a twist about her marriage

అసలే పెళ్లి వార్త ప్రస్తావించి, ఓ హీరో ఇంట్లో కలకలం రేపినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సమంత మరో బాంబ్ పేల్చింది. అ..ఆ(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ, అనసూయ పాత్ర చాలా నచ్చింది. ఈ పాత్రలో నేను చాలా అల్లరి చేస్తూ కనిపిస్తా. నిజ జీవితంలోనూ నేను అల్లరి పిల్లనే. అ..ఆ కథానాయకి ప్రాధాన్యమున్న సినిమా అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఇది గొప్ప కథేమీ కాదు.. కానీ త్రివిక్రమ్ ఎమోషన్స్ని చాలా చక్కగా చూపించారు.

ప్రతి పాత్రకు ప్రాధాన్యమిస్తూ.. తెరకెక్కించిన చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకుడని ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఏ సినిమా అయినా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తా. నితిన్ నాకు మంచి స్నేహితుడు. తనతో రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే తొలుత ఇబ్బందిగా ఉండేది అని వివరించింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటిస్తానని చెప్పిన ఈ అమ్మడు ఇంతకీ పెళ్లి చేసుకోబోయేదెవరినో మాత్రం చెప్పకుండా ట్విస్ట్ ఇచ్చింది. త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత నటిస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, పెళ్లి అయినా సరే సినిమాలు చేస్తా అని చెప్పింది.

English summary

Samantha gave a twist about her marriage. Hot beauty Samantha gave a twist about her marriage.