వెంటాడుతున్న కుజ దోషం..!

Samantha has kuja dosham

03:17 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Samantha has kuja dosham

అన్నీ కుదిరాయంటుకుంటే, మళ్లీ అడ్డంకా! ఏమిటి అది నాగ చైతన్య, సమంతల లవ్ కి ఎట్టకేలకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ చెప్పేయడంతో ఇక డిసెంబరులో నిశ్చితార్థం, పెళ్లి జరగవచ్చునని సంకేతాలు కూడా వచ్చేశాయి. అంతా హ్యాపీ అనుకుంటున్న ఈ దశలో ఓ కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. జ్యోతిష్కులను పిలిపించి వీరి జాతకాలు పరిశీలించమని నాగ్ దంపతులు కోరారని, వాటిని చూసిన జ్యోతిష్కులు.. సమంతకు కుజ దోషం ఉందని, దీనివల్ల వీరి పెళ్లి జరిగినా ఆ తరువాత ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోవచ్చునని, లేదా పిల్లలు కలగకపోవచ్చునని చెప్పారట.

దీంతో నాగార్జున కుటుంబం డైలమాలో పడిందట. ఇలా అని కొన్ని వెబ్ సైట్లలో ఆర్టికల్స్ వచ్చేశాయి. పెళ్లి అయ్యాకా సినిమాలకు గుడ్ బై చెప్పాలన్న కండీషన్ కూడా ఒప్పుకున్న సమంతకు ఏదో రకంగా ఈ పెళ్లి విషయంలో ఇంకా కష్టాలు వెంటాడుతున్నాయి. లేకపోతే శుభమా అని పెళ్లి కబురు చెప్పేందుకు అంతా రెడీ అవుతుండగా కుజ దోషమని తేలడం ఏమిటి? అసలు ఈ రకంగా పుకార్లు పుట్టిస్తున్నదెవరు.

English summary

Samantha has kuja dosham