సమంత మ్యారేజ్ లీక్.. హీరో ఇంట్లో కలకలం

Samantha leaks marriage details

10:39 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Samantha leaks marriage details

సమంత మ్యారేజ్ వ్యవహారం పై మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఓ యువ హీరోని మ్యారేజ్ చేసుకోనుందంటూ వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాతో నటించిన హీరోనే పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఇటీవల ఈ అమ్మడు చెప్పడం, దీని పై రకరకాల కధనాలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్ పై ఆ హీరో ఫ్యామిలీలో విభేదాలొచ్చినట్టు ఫిల్మ్‌నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన ఫాదర్.. కొడుకు పై సీరియస్‌గా ఉన్నాడట. దీని పై హీరోని గట్టిగా నిలదీసినట్టు టాక్. ఆ విషయం గురించి తనకేమీ తెలీదని, తండ్రికి యువ హీరో క్లారిటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందట.

అయినా సరే ఆ అమ్మాయి ఎందుకు ఇలా లీక్‌లు ఇచ్చిందంటూ హీరోకి తండ్రి క్లాస్ పీకినట్టు ఇన్సైడ్ వార్త. దీని పై ఆన్లైన్ మీడియా తాటికాయంత అక్షరాలతో రచ్చ చేసిందని, ఇలాంటి విషయాల్లోకి ఎందుకు ఇరుక్కున్నావంటూ గట్టిగా మందలించినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఇష్యూకి వీలైనంత ఇమిడియేట్‌గా ఫుల్స్టాప్ పెట్టాలని కొడుక్కి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు, ఈ క్రమంలో యువ హీరో సోషల్ మీడియా ద్వారా తన పెళ్లిగోల గురించి ఫ్యాన్స్‌కు ఓ మెసేజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. దీని పై ఎలా వెళ్తే బాగుంటుందన్న కోణంలో క్లోజ్ ఫ్రెండ్స్ వద్ద సలహాలు కూడా తీసుకున్నట్లు టాక్. మొత్తానికి సమంత ఇచ్చిన లీక్ ఆ హీరో ఇంట మంట పుట్టిస్తోంది.

English summary

Samantha leaks marriage details. Hot beauty Samantha leaked about her marriage details.