సమంత మార్కుల లిస్టులు బయట పడ్డాయి

Samantha marks list

11:49 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Samantha marks list

సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్లతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత చదువులోనూ టాప్ ర్యాంకరే అట. గత నాలుగైదు నెలలుగా అటు సినిమాలతో పాటు ఇటు నాగచైతన్యతో ప్రేమాయణం జోరుగా వార్తల్లో నిలుస్తోన్న చెన్నై చిన్నది సమంత ఇక చైతూతో పెళ్లి వార్తల దృష్ట్యా పెళ్లికి ముందే షూటింగ్ లు కంప్లీట్ చేయాలన్న భావనలో ఉందట. అందుకే వరుసపెట్టి షూటింగ్ లలో పాల్గొంటూ తీరికలేనంత బిజీగా ఉంది. అయితే గురువారం మాత్రం సమంత ఇంట్లో వాళ్లతో హ్యాపీగా గడిపింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకుంటూ వాటిని ఫ్రెండ్స్, అభిమానులతో షేర్ చేసుకుంది.

ఆమె తన చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తను కూడా ఆ విషయాలను గుర్తుచేసుకుంది. సమంత టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు ఓ లుక్కేయండి.

English summary

Samantha marks list