హైదరాబాద్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటున్న సమంత!

Samantha marriage with hyderabad guy

10:18 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Samantha marriage with hyderabad guy

ఈ టైటిల్ చూస్తే ఎవరికైనా అనుమానాలు రాక మానవు. ఎందుకంటే చేతినిండా సినిమాలు, అటు తమిళం, ఇటు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్న స‌మంత ఇంత అర్జెంటు గా పెళ్లి చేసుకుంటుందా? అది కూడా హైద‌రాబాద్ కుర్రాడితో స‌మంత పెళ్లా? అనే రకరకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతాయి.. ఈ స‌మ్మ‌ర్ అంతా సౌత్‌లో స‌మంత మాయ న‌డుస్తోంది. త‌మిళ్‌లో ఆమె న‌టించిన తెరీ, 24 చిత్రాలు రిలీజ్ అయ్యి రెండూ ఘన విజయాలు సాధించాయి. తెలుగులో మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, నితిన్ తో అ..ఆ.. సినిమాల షూటింగులు ముగిశాయి.

ఇది కూడా చదవండి: ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

ఈ రెండు స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌తో 'జ‌న‌తా గ్యారేజ్' మూవీ షూటింగ్‌లో ఆమె పాల్గొంటొంది. అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక కథ‌నం ప్ర‌కారం స‌మంత పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల‌నుకుంటోంద‌ట‌. హైదరాబాద్ కు చెందిన ఓ కుర్రాడ్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో జాలీగా గడపాలని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత చాలా అంశాలు వెల్ల‌డించింది. పొద్దున్న నిద్ర లేవగానే ఏ సినిమా షూటింగ్ కు వెళ్ళాలో తెలియక మర్చిపోతుంటానని, తన క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికే ఆమెకు టైం దొరకడం లేదట‌.

ఇది కూడా చదవండి: పట్టపగలే పార్కులో శృంగారం చేస్తూ దొరికిపోయిన జంట(వీడియో)

తన కో-స్టార్స్ మహేష్ బాబు కూతురు సితార, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ లతో ఆడుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాన‌న్న స‌మంత‌, త‌న‌కు వ‌య‌స్సు 29 సంవ‌త్స‌రాలు అని ఇప్పుడు మ్యారేజ్ టైం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినందున పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాల‌నుకుంటున్న‌ట్టు పేర్కొంది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అభ‌య్‌రామ్ కార్బ‌న్ కాపీ అని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇవ‌న్నీ బాగానే ఉన్న ఇంత‌కూ మ‌రి స‌మంత చెప్పిన‌ట్టు ఆ హైద‌రాబాద్ కుర్రాడు ఎవ‌ర‌నేది తెలియ‌డం లేదు. ఆమె చెప్పిన దానిని బ‌ట్టి టాలీవుడ్‌లో గ‌తంలో ఆమెతో సినిమాలు చేసిన ఓ టాప్ ఫ్యామిలీకి చెందిన హీరో అయి ఉండ‌వ‌చ్చేమో అన్న అనుమానాలు చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

English summary

Samantha marriage with hyderabad guy. Hot beauty Samantha want to marry hyderabad guy. She want to marry after the 2 films and want to settle in life.