పెళ్లి డేట్.. హనీమూన్ పై సమంత దిమ్మతిరిగే ట్వీట్

Samantha mind blowing tweets on marriage and honeymoon tweets

12:42 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Samantha mind blowing tweets on marriage and honeymoon tweets

ఏమిటి లోకం పలు గాయకుల లోకం అంటూ సినీ కవి ఎప్పుడో రాసేశారు. అందుకే ఎవరో ఏదో అనే మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సెలబ్రిటీలు చాలామంది తేల్చేస్తుంటారు. ఇక, ప్రేమ, పెళ్లి, హనీమూన్ లాంటి వాటిపై ఎవరో ఏదో అంటే దానికి రియాక్ట్ అయ్యే సాహసం చేయరు ప్రముఖులెవ్వరూ. కానీ.. బ్యూటీ సమంత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. నాగచైతన్యతో ఆమె పెళ్లి మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిన వేళ.. ఆమె పెళ్లి డేట్ గురించి.. హనీమూన్ గురించి ఏదేదో రాసేస్తున్నారు. ఇక ఇలాంటివన్నీ చదివి సోషల్ మీడియాలో వీటి గురించి చెప్పుకునే వాళ్లకు లెక్కే లేదు. కానీ.. ఇలా మాట్లాడే వారు పెట్టిన కొన్ని ట్వీట్స్ కు సమంత రిప్లై ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

1/5 Pages

తన ట్విట్టర్ అకౌంట్లో.. తన ఫాలోయర్లు ప్రస్తావించిన పలు ట్వీట్స్ కు సమంత ఇచ్చిన సరదా సమాధానాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పర్సనల్స్ గురించి మాట్లాడితేనే మండిపడే సెలబ్రీటీలకు భిన్నంగా విషయాల్ని లైట్ తీసుకునే తత్వం ఉన్నట్లుగా తెలివిగా సమాధానాలు చెప్పిన ఈ చెన్నై బ్యూటీ ముచ్చట్లు ఆసక్తిని రేపేలా ఉన్నాయి. చైతూతో ప్రేమ అన్న వార్తలకు కొనసాగింపుగా అతడితో పెళ్లి కన్ఫర్మ్ అయ్యిందన్న వార్త రావటం ఒక ఎత్తు అయితే.. ఆ పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ.. 2016 సెప్టెంబరు 23న ముహుర్తం పెట్టేశారంటూ పెట్టిన ట్వీట్ కు సమంత రియాక్ట్ అయి.. ఎవరూ చెప్పలేదే అని బదులిచ్చింది. ఆ మాత్రం రెస్పాన్స్ ఇస్తే.. మిగిలిన వారు ఊరుకుంటారా?

English summary

Samantha mind blowing tweets on marriage and honeymoon tweets