పవన్‌ సినిమాకి సమంత డేట్స్‌ ఎందుకు ఇవ్వడంలే ?

Samantha Not Giving Dates For Pawan Kalyan

04:38 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Samantha Not Giving Dates For Pawan Kalyan

'ఏ మాయ చేశావె' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ సమంత. మొదటి చిత్రమే సూపర్‌హిట్‌ కావడంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత ఈ అమ్మడు ఎన్టీఆర్‌, మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరోలతో నటించింది. అయితే ఈ అమ్మడుకి అవకాశాలు కాస్త తగ్గుతున్న సమయంలో పవన్‌కళ్యాణ్‌-తివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో రూపొందనున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ కావడంతో ఈ అమ్మడు ఇంక స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం అయిపోయాక పవన్‌ ఎస్‌.జె సూర్య దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పవన్‌ సరసన సమంతాని తీసుకునే ఆలోచనలో సూర్య ఉన్నాడట. అయితే సమంత కార్తీ సరసన నటించే చిత్రం కోసం డేట్స్‌ ఇచ్చేసింది. అయితే పవన్‌ పక్కన హీరోయిన్‌గా నటించడమంటే ఎవరూ అంత తేలిగ్గా వదులుకోరు. ఎంతో మంది పవన్‌ పక్కన నటించే అవకాశం వస్తే చాలు జీవితం ధన్యం అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇప్పుడు సమంత పవన్‌ సినిమాకి డేట్‌ ఇస్తుందా లేక పవన్‌ సినిమాని వదులుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

English summary

Samantha was one of the top actress in South Film Industry.She has previously acted with Power Star Pawan Kalyan in Attarintiki Daredi movie under the direction of Trivikarm srinivas.At Present Pawan Kalyan was acting in Sardar Gabbar Singh movie and Next he may be act in the Direction Of S.J.Surya.A news came to know that Surya asked Samantha dates for Pawan Kalyan's movie and samantha unable to give movie dates because she gave dates to Karthi Movie.