సమంత లవ్ మ్యారేజ్ కి లైన్ క్లియర్!

Samantha parents accepted for her love marriage

11:06 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Samantha parents accepted for her love marriage

హాట్ బ్యూటీ సమంత తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అంటూ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక యువ హీరోను తాను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగా సమంత మీడియా ముందు వివరించింది. ఆ యువ హీరో ఎవరు అనే విషయం ఆమె చెప్పలేదు కానీ, అక్కినేని హీరో నాగచైతన్య అయ్యి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత ప్రేమ పెళ్లికి మొదట ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. సమంత బలవంతం చెయ్యడంతో ముందు ఆమె తల్లి పెళ్లికి ఓకే చెప్పింది. ఇప్పుడు తాజాగా సమంత తండ్రి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సమంత వైపు నుండి ప్రేమ పెళ్లికి ఇప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని తమిళ సినీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు అనే క్లారిటీ వస్తే అతడి వైపు అంతా ఓకేనా అనే విషయం తెలుస్తోంది. ఒకవేళ సమంత చేసుకోబోతున్నది చైతూనే అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే నాగార్జున తన ఇద్దరు కొడుకులు ప్రేమ వివాహం చేసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చాలాసార్లు తెలియజేసారు. కాబట్టి అంతా అనుకున్నట్లుగా జరిగితే సమంత ప్రేమ వివాహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత సమంత నటిస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

English summary

Samantha parents accepted for her love marriage