పవన్‌ సినిమా పై సమంత సంచలన కామెంట్స్‌

Samantha Praises Director Pawan Kumar

01:31 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Samantha Praises Director Pawan Kumar

ట్విట్టర్‌ లో తన గురించి అప్‌డేట్స్‌ చేస్తూ, తనకి నచ్చిన హీరోలపై కామెంట్స్‌ చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం సమంత అలవాటు. గతంలో ఈ అమ్మడు మహేష్‌ '1' పోస్టర్‌ పై కామెంట్స్‌ చేసి మహేష్‌ అభిమానులతో చివాట్లు తిన్న విషయం తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఈ అమ్మడు సూర్య 'సికంధర్‌' చిత్రంపై కూడా కొన్ని కామెంట్స్‌ అప్పుడు కూడా అలానే చిక్కుల్లో కూరుకుంది. అయితే గత కొంతకాలంగా అటువంటి వాటికి దూరంగా ఉంటున్న సమంత తాజాగా మళ్లీ ట్విట్టర్‌లో ఒక సినిమా పై కామెంట్స్‌ చేసింది. రీసెంట్‌గా విడుదలైన 'యూ టర్న్‌' అనే కన్నడ చిత్రం ట్రైలర్‌ పై సమంత ట్వీట్‌ చేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ సమంతాకి తెగ నచ్చిందట. ఇంక వెంటనే ఈ ట్రైలర్‌ సింప్లీ సూపర్బ్‌ అంటూ సమంత కామెంట్‌ చేసింది. ఈ చిత్రానికి "పవన్‌ కుమార్‌ "దర్శకత్వం వహించాడు. అంతకు ముందు పవన్‌ 'టాసియా' అనే చిత్రాన్ని కన్నడలో తెరకెక్కించాడు. అది కన్నడలో సూపర్‌హిట్‌గా నిలువడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రమే సిద్ధార్ధ్‌ తమిళంలో 'ఎనక్కుల్‌ ఒరువన్‌' అని తమిళంలో రీమేక్‌ చెయ్యగా తెలుగులో 'నాలో ఒక్కడు' గా విడుదలైంది.

English summary

Samantha Praises Tamil Young Pawan Kumar for his latest film U Turn Trailer.She Posted "Dubbing over #Theri .Thankyou my amazing director @Atlee_dir for a role close to my heart.So much love@Jagadishbliss " in her twitter