ఐసిస్ గురించి సమంతకు ఎందుకో ..!

Samantha Reading Rise of ISIS Book

11:47 AM ON 13th July, 2016 By Mirchi Vilas

Samantha Reading Rise of ISIS Book

చైతూతో తన రొమాన్స్ వ్యవహారం సాగిస్తూ, త్వరలో పెళ్లి పీటలపైకి ఎక్కనున్న సమంత ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఐసిస్ మీద ఎందుకు దృష్టి పెట్టింది. అసలు సమ్మూకి ఈ గొడవ ఎందుకు అనుకుంటున్నారు అంతా. ఇంతకీ విషయం ఏమంటే, ఈ మధ్య పుస్తకాలు తెగ చదివేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మీద ఓ అమెరికన్ రచయిత రాసిన పుస్తకాన్ని ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, రైజ్ ఆఫ్ ఐసిస్ అనే ఈ బుక్ ని చదువుతున్నానని, దీన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో తన ఒపీనియన్ ని కూడా షేర్ చేసింది.

అసలీ బుక్ లో ఏముంద ని ఆరా తీస్తే, ఐసిస్, హమస్ వంటి టెర్రరిస్టు గ్రూపులు ఎలా పుట్టుకొచ్చాయి.. వాటి లక్ష్యాలేమిటి.. వాటిని ఎదుర్కోకుండా అలాగే వదిలేస్తే జరిగే మారణ కాండ ఎలా ఉంటుంది..ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై సమగ్ర విశ్లేషణ తో కూడిన ఈ పుస్తకాన్నే చదవాలంటోంది ఈ అమ్మడు. మొత్తానికి నాగ చైతన్యతో తన ప్రేమాయణం పెళ్లి వరకూ వచ్చాక..సినిమా షూటింగులు తగ్గించుకుని ఇలా పుస్తకాల పఠనం లో బిజీ అయినట్టు కనిపిస్తోంది. ద్వేషాన్ని వెలిగక్కేవారిని దాన్నుంచి తప్పించి ప్రేమతో వారిని ఎలా జయించాలో తెలుసుకోవాలంటే, దీన్ని చదివి తీరాలని గట్టిగా చెప్పేస్తోంది. అమెరికాలో పాపులర్ అయిన అటార్నీలలో ఒకరైన జే సెకులో రాసిన పుస్తకమిది.. ఉగ్రవాద శక్తులపై పోరాడేవారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని సమంత అభిప్రాయపడింది.

English summary

Samantha Reading Rise of ISIS Book.