దాని కోసమే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు హోటల్ కి వెళ్లారు!

Samantha Regina Rakul Vacation To Belgium

01:29 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Samantha Regina Rakul Vacation To Belgium

అన్ని రంగాల్లో వచ్చినట్లు గానే సినీ రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. అప్పట్లో సినిమా తారల మధ్య ముఖ్యంగా హీరోయిన్ల మధ్య స్నేహం వున్నా, కల్సి గడపడాలు గట్రా లేవు. మరి ఎంతైనా ఈతరం హీరోయిన్ల రూటే సపరేటు కదా. ఒకరికొకరు ఎంత అండర్ స్టాండింగ్ గా ఉంటారో కూడా. వీళ్లమధ్య గిల్లికజ్జాలు అస్సలు ఉండవు. ఒకవేళ వున్నా కనపడనివ్వరు కదా. ఇక ఎవరికి వచ్చిన సినిమాల్ని వాళ్లు చేసుకొంటూ ఆడుతూ పాడుతూ ముందుకెళ్లిపోతున్నారు. చిన్న చిన్న హీరోయిన్లే కాదు - స్టార్ హీరోయిన్లు కూడా దోస్త్ మేరా దోస్త్ అంటూ ఫ్రెండ్ షిప్ మెంటైన్ చేస్తున్నారు. ఖాళీ దొరికగానే ఎంచక్కా అంతా ఒక హోటల్ లో చేరిపోయి మంచి చెడులు పంచుకొంటుంటారట. టాలీవుడ్ హీరోయిన్లంతా ఒకే హోటల్ లో గడుపుతుంటారనే ఓ టాక్ కూడా వస్తోంది. వర్క్ పరంగా అప్పుడప్పుడు కాంపిటీట్గా ఫీలైనప్పటికీనీ ఫ్రెండ్ షిప్ ని మాత్రం అలాగే మెంటైన్ చేస్తుంటారు.

తాజాగా ముగ్గురు హీరోయిన్లు కలిసి ఎంచక్కా యూరప్ టూర్ ప్లాన్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ - సమంత - రెజీనాలు ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు. వీళ్లకి డిజైనర్ నీరజ కోన కూడా తోడైంది. ఈ ముగ్గురు హీరోయిన్లూ ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. మరి టుమారో ల్యాండ్ 2016.. అంటూ ఇప్పుడు బెల్జియంలో దేశం రాజధాని బ్రస్సెల్స్ లో ఒక మ్యూజిక్ కన్సార్ట్ జరుగుతోంది. ప్రపంచంలోని చాలామంది ఔత్సాహిక మరియు టాలెంటెడ్ మ్యూజిషియన్లు అక్కడ లైవ్ లో వాయిస్తుంటే ఆ కిక్కే వేరంతే. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కు టాలీవుడ్ నుండి కూడా ఎటెండన్స్ ఉంది. అందుకే ఈ నలుగురితో పాటు అక్కడే వున్న కుర్ర హీరో నితిన్, యురోప్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న రవితేజ కూడా ఈ ఫెస్టివల్ కు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:‘కబాలి’ హిందీలో రీమేక్ - హీరోగా బిగ్ బి!

ఇవి కూడా చదవండి:కబాలి మూడు రోజుల కలక్షన్స్ ఎంతో తెలుసా.!

English summary

Tollywood Top Heroines Samantha,Regina,Rakul Preeth Singh and Costume Designer Neeraja Kona were fashion icons in Telugu Film industry and now these four were on a vacation in Belgium to attend a live Music program.