సమంత ‘నాకు ఇంకో పేరుంది’ మోషన్ పోస్టర్

Samantha Releases Naaku Inko Perundi Motion Poster

10:48 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Samantha Releases Naaku Inko Perundi Motion Poster

సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూ, సంగీతం అందించిన 'నాకు ఇంకో పేరుంది'  సినిమా మోషన్ పోస్టర్‌ను సమంత తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కి సినిమాకి సమంత బెస్ట్ విషెస్ తెలిపింది. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జీవీ ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ సినిమాలో కూడా అతడితో జోడీ కట్టింది. ఈ చిత్రానికి కెమెరా : కృష్ణన్ వసంత్ , ఎడిటర్ : రుబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్, కథ, 

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని..పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను కొద్దిరోజుల్లో విడుదల చేసి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నాకు ఇంకో పేరుంది సినిమా గురించి మరిన్ని విషయాలు స్లైడ్ షోలో..

1/6 Pages

రజినీకాంత్ మీద అభిమానం

ఈ సందర్భంగా జీ‌వీ ప్రకాష్ మాట్లాడుతూ "యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. రజనీకాంత్ గారి ‘బాషా’లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టాం. చిత్రంలో నా పేరు జాని. 1980లో ‘జాని’ పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. సమంత మా చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది" అని పేర్కొన్నాడు.

English summary

Heroine Samantha releasews the motion poster on Music Director who became hero G.V.Prakash movie "Naaku Inko Perundi" movie.G.v.Prakash was become famous in telugu with the movie Trisha leda Nayanatara movie.