పాపం రూ. వెయ్యికోసం 3 గంటలు నిలబడిందట

Samantha remembered olden days

02:40 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Samantha remembered olden days

పుట్టుకతో అందరూ శ్రీమంతులు కారు. అయితే కొందరు పుట్టుకతోనే శ్రీమంతులవుతారు. కొందరు పెద్దయ్యాక స్వశక్తితో శ్రీమంతులుగా మారతారు. ఆ కోవాలోకి సమంత కూడా వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కోటి రూపాయలు దాటి రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా పాత రోజుల్ని మరిచిపోకూడదు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తిత్వం ఈమెది. అందుకే డబ్బుల కోసం గతంలో తను ఎన్ని కష్టాలు పడిందో కూడా ఈమెకు ఇంకా గుర్తున్నాయి. అందుకే ఓ సంఘటన చెప్పుకొచ్చింది.

నాకు పద్నాలుగేళ్లు వచ్చేసరికే డబ్బు సంపాదన మొదలుపెట్టా. ఏ పని దొరికితే ఆ పని చేసేదాన్ని. పెద్దవారి ఇళ్లల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడి అతిథులపై పన్నీరు చల్లే పనికి కూడా వెళ్లేదాన్ని. మూడు గంటలు నిలబడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బు ఎంతో సంతృప్తినిచ్చేది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా అప్పటి ఆనందం మాత్రం ఉండడం లేదు అని చెప్పింది. ఇలా పాతరోజుల్ని మరిచిపోకుండా తలుచుకోవడం మామూలు విషయం కాదని సినీ లవర్స్ అంటున్నారు.

English summary

Samantha remembered olden days