అమ్మో ఈ అమ్మడు 'బ్రహ్మోత్సవం' స్టోరీ చెప్పెసిందే!

Samantha revealed the story of Brahmotsavam

10:09 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Samantha revealed the story of Brahmotsavam

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టోరీ ఏంటనే ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. కథ విషయంలోనే చాలానే కన్ఫ్యూజన్ ఉంది అభిమానుల్లో. కానీ ఇలాంటి వాటన్నిటికీ ఒకే ఒక్క డైలాగ్ తో సమాధానం ఇచ్చేసింది సమంత. ఆడియో లాంఛ్ సందర్భంగా ఓ పాటను విడుదల చేయడానికి వచ్చిన సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'సాధారణంగా ఏ సినిమాలో అయినా ఎలా చేస్తాననే టెన్షన్ ఉంటుంది. కానీ మహేష్ బాబు పక్కన ఎలా కనిపిస్తానని టెన్షన్ పడ్డాను. ఇప్పటికే మహేష్ తో రెండు సినిమాలు చేశాను. రెండూ సూపర్ హిట్.

మూడో సినిమా అయిన బ్రహ్మోత్సవంతో తప్పని సరిగా హ్యాట్రిక్ కొడతాను' అని సమంత చెప్పింది 'పేరెంట్స్ పిల్లలను వెతకడం సహజంగా జరిగేదే. కానీ పిల్లలు ఫ్యామిలినీ రూట్స్ ని వెతుక్కోవడం అనే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అది శ్రీకాంత్ అడ్డాల పర్ఫెక్ట్ గా చూపించారు' అంటూ సినిమాలో అసలు పాయింట్ ఏంటో సమంత చెప్పేసింది. చివర్లో 'చిన్న చిన్న ఉత్సవాలు కలిపితే బ్రహ్మోత్సవం అవుతుంది.. అదే మా బ్రహ్మోత్సవం' అంటూ తన తోటి హీరోయిన్స్ అయిన కాజల్ అండ్ ప్రణీతలకు ఆల్ ది బెస్ట్ చెప్పడం ఆకట్టుకుంది.

English summary

Samantha revealed the story of Brahmotsavam. Hot beauty Samantha revealed the story of Brahmotsavam.