ఆ కండీషన్ తో నాగ్ ఒకే

Samantha says goodbye to movies

10:41 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Samantha says goodbye to movies

లవ్ గెలవాలంటే కొన్ని వదులుకోవాలి. వదులుకోకపోతే లవ్ లో ఫెయిల్ అవ్వడం ఖాయం. మనస్సుకి నచ్చినోడు దక్కడం కోసం బ్యూటీ సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. నిజానికి సినిమాలు వదలుకుని పెళ్లి చేసుకుని ఇక లైఫ్ లో సెటిల్ అవుతానని ఆ మధ్య సమ్మూ ప్రకటించింది. ఇప్పుడు అలాగే చేయబోతోందని టాక్. నాగ చైతన్యతో తన లవ్ ట్రాక్ లో పడి ఇక విషయం పెళ్లి వరకూ వచ్చాక, చైతూ తండ్రి నాగార్జున ఇచ్చిన ఆర్డర్స్ కు ఓకె చెప్పిందని అంటున్నారు.

ఇక సినిమాలు మానుకోవాలని నాగ్ కోరాడట. పైగా కోలీవుడ్ లో ధనుష్ తో సమంత చేయబోయే వడా చెన్నై ప్రాజెక్టు పే చెక్ ను వాళ్లకు తిరిగి వాపసు చేయాలని నాగ్ సూచించాడని తెలిసింది. దీంతో తన ప్రొఫెషన్ కన్నా తన లవ్, తన పెళ్ళే ముఖ్యమని భావించిన సమ్మూ అలాగే చేసిందని అంటున్నారు. ఇదంతా నిజమే అయితే కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో చైతూ తో చేయనున్న సినిమాయే సమ్మూ కి చివరిది అవుతుందని చెప్పక తప్పదు. ఏదైతేనేం అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళుతున్న సమంత ఆ కుటుంబానికి అనువుగా నడుచుకుంటానని చెప్పడానికి ఇది తొలి అడుగు అనవచ్చునేమో.

ఇది కూడా చూడండి: శ్రీమంతుల అందమైన కూతుళ్ళు

ఇది కూడా చూడండి: అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

ఇది కూడా చూడండి: త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!

English summary

Samantha agree with Akkineni Nagarjuna Order. Samantha says goodbye to movies.