అక్కినేని ఫ్యామిలీపై సమంత సంచలన వ్యాఖ్యలు(వీడియో)

Samantha sensational comments on Akkineni family

02:42 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Samantha sensational comments on Akkineni family

సమంత లవ్ ఎఫైర్ నేపథ్యంలో పలువురు చేస్తున్న కామెంట్స్, వారు పెట్టిన కొన్ని ట్వీట్స్ కు సమంత రిప్లై ఇస్తూ, అక్కినేని ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ట్విట్టర్ అకౌంట్లో.. తన ఫాలోయర్లు ప్రస్తావించిన పలు ట్వీట్స్ కు సమంత ఇచ్చిన సరదా సమాధానాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పర్సనల్స్ గురించి మాట్లాడితేనే మండిపడే సెలబ్రీటీలకు భిన్నంగా విషయాల్ని లైట్ తీసుకునే తత్వం ఉన్నట్లుగా తెలివిగా సమాధానాలు చెప్పిన ఈ చెన్నై బ్యూటీ ముచ్చట్లు ఆసక్తిని రేపేలా ఉన్నాయి. చైతూతో ప్రేమ అన్న వార్తలకు కొనసాగింపుగా అతడితో పెళ్లి కన్ఫర్మ్ అయ్యిందన్న వార్త రావటం ఒక ఎత్తు అయితే.. ఆ పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ.. 2016 సెప్టెంబరు 23న ముహుర్తం పెట్టేశారంటూ పెట్టిన ట్వీట్ కు సమంత రియాక్ట్ అయి.. ఎవరూ చెప్పలేదే అని బదులిచ్చింది. ఆ మాత్రం రెస్పాన్స్ ఇస్తే.. మిగిలిన వారు ఊరుకుంటారా? ఇక.. ట్వీట్స్ చేయటం మొదలెట్టారు.

వీటికి సమంత కూడా రియాక్ట్ అయింది. వెబ్ సైట్స్ హనీమూన్ షెడ్యూల్ కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నాయి అంటూ అక్కసు వెళ్లగక్కుకున్న వ్యక్తి ట్వీట్ కి సమంత రియాక్ట్ అయి.. మీకు నమష్కారాలు.. అని బదులిచ్చింది. పెళ్లి డేట్ అంటూ పోస్ట్ పెట్టిన వ్యక్తిని ఉద్ధేశిస్తూ.. ముహూర్తం చెప్పిన వ్యక్తి.. హనీమూన్ ఎక్కడో ఎందుకు చెప్పటం లేదో అంటూ ఆరా తీసిన ట్వీట్ కి బదులిచ్చిన సమంత.. ఇవన్నీ స్టార్ట్ చేసింది మీరే.. ఇప్పుడీ ట్వీట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ.. పారిస్ వెళ్దామనుకుంటున్నా? మీరేమంటారు? అంటూ ఎటకారం చేసింది. దీనికి అంతే కామెడీగా స్పందించిన మరొకరు ట్వీట్ చేస్తూ.. యాక్షన్ ప్యాక్డ్ హనీమూన్ అయితే ఇస్తాంబుల్ వెళ్లండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన సమంత.. టెమ్టింట్ గా ఉంది అని అంది. మ్యారేజ్ వెన్యూ పార్క్ హయత్ ఎందుకు కాకూడదు? అన్న ట్వీట్ కు స్పందించిన సమంత.. వావ్.. ప్రతి ఒక్కరూ ఈ సంభాషణలో పాల్గొంటున్నారు అని బదులిచ్చింది. ఈ ట్వీట్స్ చూసిన మరొకరు.. ఈ సోది అంతా దేనికి ఏదో ఒకటి రివీల్ చేస్తే అయిపోతుందిగా డార్లింగ్ అంటూ సరదాగా సిరాకు పడిపోయిన వ్యక్తికి అంతే సరదాగా.. ఏదోఒకటి ఉండాలిగా డార్లింగ్ అంటూ బదులిచ్చేసింది.

English summary

Samantha sensational comments on Akkineni family