సమ్మర్ స్పెషల్ సమంతయే  ....  

Samantha Seven Films Was Releasing In This Summer

06:58 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Samantha Seven Films Was Releasing In This Summer

మార్చి రాకుండానే సమ్మర్ వేడి తాకుతుంటే, ఇక ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగానే ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. మరి సమ్మర్ లో సినీ సందడి ఎక్కువే. అందునా క్యూట్ బ్యూటీ సమంత చిత్రాలే హల్ చల్ చేయనున్నాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ యమ జోష్ మీదున్న ఈ అమ్మడు మధ్యలో కాస్త నెమ్మదించిన ప్రస్తుతం మాత్రం తెలుగు, తమిళ భాషల్లో సుమారు ఏడు చిత్రాల్లో చేసేస్తోంది. ఇందులో కొన్ని చిత్రాలు వేసవికి విడుదలవుతుండటంతో... అమ్మడు సమ్మర్ స్పెషల్ కాబోతోంది. మరి క్యూట్ బ్యూటీ సమంత సినిమాల వైపే సినీజనం అడుగులు వేసి సేద దీరబోతున్నారు. ప్రస్తుతం తెలుగునాట మాటల మాంత్రికుడు గా పేర్గాంచిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ ఆ’లో నితిన్ సరసన నటిస్తోన్న ఈ ఒయ్యారి భామ సమ్మర్ క్వీన్ కాబోతోంది. ఎందుకంటే ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమౌ తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ తో కల్సి నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ కూడా మేలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాలపైనా భారీ అంచనాలు ఉండనే ఉన్నాయి.

అలాగే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో చురుగ్గా నిర్మాణమవుతున్న ‘జనతా గ్యారేజ్’లోకూడా క్యూట్ బ్యూటీయే హీరోయిన్ గా వేస్తోంది. కోలీవుడ్‌లో చూస్తే సమంత స్టార్ హీరోల సరసన సందడి చేస్తోంది. విజయ్‌తో ‘తేరీ’, సూర్యతో ‘24’లో నటించిన సమంత సినిమాలు ఈ మండు వేసవి లోనే రాబోతున్నాయి. దీంతో ఈ సమ్మర్‌లో రెండు భాషల్లోనూ హీరోల కన్నా సమంత సెగ ఎక్కువ తాకనుంది. ఇటీవలే తమిళంలో సమ్మూ నటించిన 'బెంగళూరు నాట్కల్' విడుదల అయింది. ఇది పెద్దగా హిట్ అవ్వకపోయినా సమంత పోషించిన పాత్రకు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయట. మొత్తానికి సమ్మర్ స్పెషల్ క్వీన్ సమంత ఆడే, ఏసీ సినిమా హాళ్ళకు అడుగులు వేసి, సమ్మర్ నుంచి ప్రేక్షకులు ఉపశమనం పొందనున్నారేమో...

English summary

Tollywood Top Heroine Samantha was now acting in 7 films in Both telugu and tamil languages.TIn this year samantha going to be rock with her fimls