కొన్నిసార్లు సీన్ డిమాండ్ చేస్తే చూపించక తప్పదు

Samantha shocking comments about her movie carrier

02:40 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Samantha shocking comments about her movie carrier

వరుస చిత్రాలతో విజయం అందుకుంటున్న సమంత ఈ సమ్మర్ లో పలు చిత్రాలతో సందడి చేయబోతోంది. ఈ ముద్దుగుమ్మ పలు అంశాలపై మాట్లాడుతూ, 'వదంతులు నన్ను బాధించవని అంటే అబద్ధం చెప్పినట్టే అవుతుంది. మిగిలిన రంగాల్లో ఎవరికైనా ఓటమి ఎదురైతే అది ఎక్కువ మందికి తెలియదు. కేవలం వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. కానీ నటీమణుల విషయంలో చిన్న గాసిప్‌ పుట్టినా క్షణాల్లో లోకమంతా పాకుతుంది. అందువల్ల నటిగా నిలదొక్కుకోవాలంటే మానసిక పరిపక్వత, ఆత్మస్థైర్యం చాలా కీలకం. భగవంతుడి దయ వల్ల నా గురించి ఎవరేం రాసినా వాటిని నా ఎదుగుదలకు సోపానంగా ఉపయోగించుకున్నానేకానీ ఎప్పుడూ కుంగిపోలేదు' అని వివరించింది.

ఇది కూడా చదవండి: బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చోటుచేసుకున్న అంశం ప్రస్తావిస్తూ, 'సమంత అన్నీ రకాల పాత్రలకు సరిపోదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేయగలదు. నిండుగా కప్పుకుని చేసే పాత్రలే ఆమెకు సూటవుతాయి... అంటూ నా కెరీర్‌ ప్రారంభంలో పలు రకాలుగా అనుకున్నారు. అయితే వారు అన్న మాటలు అవాస్తవాలని నిరూపించడానికే నేను గ్లామర్‌ బాట పట్టా' అని చెప్పుకొచ్చింది. 'గ్లామర్ మరియు మాస్‌ పాత్రలకు నేను పనికి రానన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికి నేను గ్లామరస్‌గా కొన్ని సినిమాల్లో కనిపించాను. సో ఇప్పుడు నేను అన్ని రకాల పాత్రలనూ చేయగలననే నమ్మకం అందరికీ వచ్చింది.

ఇది కూడా చదవండి: ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

దాంతో నాకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటాను' అని వివరించింది. నేను తొలి సినిమాలోనే ముద్దులు పెట్టేశాను. ఇప్పుడు 'సారీ నేను కిస్‌ చేయను' అని అంటే ఎలా. సీన్ పండటానికి నటిగా నా వంతు కృషి చేయడానికి నేనెప్పుడూ వెనుకాడను అని గర్వంగా చెబుతోంది.

ఇది కూడా చదవండి: 20 ఏళ్ల అమ్మాయిలతో 60 ఏళ్ల గురువు రాసలీలలు (వీడియో )

English summary

Samantha shocking comments about her movie carrier. Samantha told that if scene is demands then we have to expose.