చైతూపై తన ప్రేమని పబ్లిక్ గా చెప్పేసిన సమంత!

Samantha Tweets on Naga Chaitanya Premam movie

12:05 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Samantha Tweets on Naga Chaitanya Premam movie

లవ్ ఎఫైర్ తో టాప్ మోస్ట్ వార్తలకు ఎక్కిన సమంత ఇప్పుడు ఏమి ట్వీటు చేసినా కూడా అది పెద్ద వార్తే అయి కూర్చుంటోంది. ఆ మధ్యన సరదాగా ట్విట్టర్లో ఓ ట్వీట్ చేస్తూ, సెప్టెంబర్ లో పెళ్ళి చేసుకోవట్లేదని చెప్పింది. అంతకంటే ముందు తనకు ఎన్ లాకెట్ అంటే చాలా అమూల్యమైన విషయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇదంతా నాగ చైతన్య గురించే అని రూమర్లు వస్తూనే వున్నాయి. ఇక ఇద్దరూ కలసే హైదరాబాదులో పలుమార్లు కెమెరాలకు చిక్కడం, తరువాత బెల్జియంలో కూడా కలసే కనిపించడంతో, ఇదంతా చాలా బలమైన ప్రేమఅనే సంగతి బల్లగుద్ది మరీ చెప్పినట్లయింది.

1/4 Pages

అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ప్రేమమ్ సినిమా గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. మలయాళంలో ప్రేమమ్ సినిమా వచ్చినప్పుడు నివిన్ పౌళీ వేసే మూడు క్యారెక్టర్ల తాలూకు లుక్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే, ఇప్పుడు మాత్రం నాగ చైతన్య ఈ రీమేక్ సినిమాలో మూడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఎలా కనిపిస్తాడో క్లియర్ గా ఈ పోస్టర్లోనే చెప్పేశారు. అదంతా ఒకెత్తయితే ఈ పోస్టర్ గురించి ప్రస్తావించిన సమంత, కేవలం మూడు లవ్ సింబల్స్ పోస్టు చేసి, దాని పక్కన ఏమీ రాయకుండా లింక్ మాత్రమే ట్విట్టర్లో షేర్ చేసింది. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

English summary

Samantha Tweets on Naga Chaitanya Premam movie